Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఓయూ
వర్సిటీల్లో పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన కామన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎంట్రెన్స్ టెస్ట్ (సీపీజీఈటీ-2022 ) మొదటి విడత సీట్ల జాబితాను బుధవారం సాయంత్రం ఓయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ పప్పుల లక్ష్మీనారాయణ కన్వీనర్ ప్రొఫెసర్ ఐనవోలు పాండురంగారెడ్డితో కలిసి విడుదల చేశారు. తొలి విడతలో 21,329 మంది విద్యార్థులు సీట్లు పొందగా, ఇందులో ఇందులో సుమారు 15 వేల మంది అమ్మాయిలే ఉండటం విశేషం. సీటు పొందిన విద్యార్థులు సంబంధిత కళాశాలల్లో ఈనెల 31లోపు జాయిన్ కావాలని కన్వీనర్ ప్రొ.పాండురంగారెడ్డి సూచించారు. రెండో విడత కౌన్సెలింగ్‌ను నవంబర్ మొదటి వారంలో విడుదల చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో పీజీ అడ్మిషన్స్ జాయింట్ డైరెక్టర్స్ ప్రొఫెసర్ జలపతి, డా.టి.గంగాధర్, డా.అక్తర్ అలీ, చీఫ్ వార్డెన్ ప్రొ.కె.శ్రీనివాసరావు, ప్రొ. వర్ధిని పాల్గొన్నారు.