Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేఆర్ఎంబీకి మరోసారి తెలంగాణ విజ్ఞప్తి
- ఇప్పటిదాకా 40 లేఖలు
- పట్టించుకోని కేంద్ర జలశక్తిశాఖ
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
ఏపీ ప్రభుత్వం అనుమతులు లేకుండా చేపడుతున్న ప్రాజెక్టులను ఆపాలని కష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డ్(కేఆర్ఎంబీ)కి తెలంగాణ ప్రభుత్వం మరోసారి లేఖ రాసింది. ఇప్పటి వరకు కొత్త ప్రాజెక్టుల నిర్మాణం, విస్తరణకు సంబంధించి మొత్తం 40 లేఖలు పంపింది. ఏపీపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం వల్ల అనుమతులు లేకుండానే కొత్త ప్రాజెక్టుల ప్రక్రియను యథేచ్చగా కొనసాగిస్తున్నదని ఈఎన్సీ సి. మురళీధర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఏపీలో అనుమతులు లేని పలు ప్రాజెక్టుల పేర్లను లేఖలో తెలంగాణ స్పష్టంగా ప్రస్తావించింది. ఆంధ్రప్రదేశ్ పునర్వీభజన చట్టం-2014 ప్రకారం సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో జరుగుతున్న అవకతవకలను కేంద్ర జలశక్తి శాఖ దృష్టికి గత కొన్నేండ్ల నుంచి రాష్ట్ర ప్రభుత్వం తీసుకెళుతున్నది. అపెక్స్ కమిటీని సైతం ఏపీ సర్కారు పట్టించుకోవడం లేదని లేఖలో పేర్కొన్నది. కొత్తగా ప్రాజెక్టులు కట్టడంతోపాటు పాత వాటిని విస్తరించడాన్ని తప్పుబట్టింది. లేఖలు రాస్తున్నా కేఆర్ఎంబీ పట్టించుకోకపోవడంతో కృష్ణా బేసిన్లోని శ్రీశైలం, నాగార్జునసాగర్ రిజర్వార్ల పరిధిలో ప్రాంతాలు సాగునీటిని నష్టపోతున్నాయని ఇంజినీర్ ఇన్ చీఫ్ బుధవారం కేఆర్ఎంబీకి లేఖలో తెలియజేశారు.