Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి కేటీఆర్కు పీఆర్టీయూ తెలంగాణ వినతి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో దీర్ఘకాలంగా పెండిం గ్లో ఉన్న ఉపాధ్యాయుల పదోన్న తులు, బదిలీల ప్రక్రియను ప్రభుత్వం త్వరగా చేపట్టాలని పీఆర్టీయూ తెలంగాణ కోరింది. ఈ మేరకు ఐటీ, పురపాలక శాఖ మంత్రి కె తారక రామారావును బుధవారం హైదరా బాద్లో ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎం చెన్నయ్య, ప్రధాన కార్యదర్శి ఎం అంజిరెడ్డి కలిసి వినతిపత్రం సమర్పించారు. 317 జీవో అమల్లో భాగంగా స్థానికత కోల్పోయిన ఉపాధ్యాయులకు రాబోయే బదిలీల్లో స్థానిక జిల్లాకు అవకాశమివ్వాలని సూచించారు. సీఎం కేసీఆర్తో సంప్రదించి తగు నిర్ణయం తీసుకుంటామని మంత్రి కేటీఆర్ సానుకూలంగా స్పందించారని తెలిపారు.