Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విచ్ఛిన్నకర రాజకీయాలకు బీజేపీ ప్రోత్సాహం
- దీన్‌దయాల్ ఉపాధ్యారు, వాజ్పేరులకు విరుద్ధంగా పాలన
- సమగ్ర మానవతావాదం, అంత్యోదయ భావనలకు తూట్లు
- సమాజంలో చీలికలు తీసుకొచ్చి రాజకీయ లబ్ది : బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డాకు రాపోలు ఆనందభాస్కర్ లేఖ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
'గ్రేట్ బ్రిటన్ జనాభాలో భారత సంతతికి చెందిన వారు మూడు శాతమే. అయినప్పటికీ, భారత సంతతికి చెందిన వ్యక్తి ఆ దేశ ప్రధాని అయ్యారు. మరో అగ్రరాజ్యం అమెరికాకు భారత సంతతికి చెందిన మహిళ ఉపాధ్యక్ష పదవి చేపట్టారు. ప్రపంచ దేశాల్లో ఈ పరిస్థితులుండగా.. మన దేశంలో మాత్రం ప్రజలను చీల్చుతూ విచ్చిన్నకర రాజకీయాలను బీజేపీ ప్రోత్సహిస్తున్నది. సమగ్ర మానవతావాదం, అంత్యోదయ భావనలను పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ దీన్ దయాల్ ఉపాధ్యారు సూచించారు. ఆ లక్ష్యాలను చేరడానికి బీజేపీలో ఏ కోశానైనా నిబద్ధత కనిపిస్తున్నదా? అటల్ బిహారీ వాజ్‌పేయీ రాజధర్మాన్ని పాటిం చాలని పిలుపునిచ్చారు. సహకార సమాఖ్యవాదంలో ఆయన పిలుపును ఎప్పుడైనా అనుసరించారా? రాజకీయ ప్రయోజనాలే లక్ష్యంగా ప్రజలను భయ భ్రాంతులకు గురిచేయడం, సమాజంలో చీలికలు తీసుకురావడమే పార్టీకి నిత్యకృత్యంగా మారింది. ఆ చీలికలతోనే బీజేపీ రాజకీయ లబ్ది పొందుతున్నది. ఇలాంటి పరిస్థితుల్లో బీజేపీలో ఇమడలేకపోతు న్నాను. అరుణ్‌జైట్లీ ప్రోత్సాహంతో 2019 ఏప్రిల్ 4న మీ పార్టీలో చేరా. ఈ నాలుగేండ్ల కాలంలో జాతీయ స్థాయిలో నన్ను విస్మరించారు. ఎన్నోసార్లు అవమానించారు. తక్కువ చేసి చూశారు. అయిన ప్పటికీ, ఆ ఆవేదనను దిగమింగుతూనే వచ్చా. ఇక ఇమడలేకపోతున్నాను. భారతీయ జనతాపార్టీ (బీజేపీ)నుంచి ఈ క్షణం నుంచి దూరమవుతున్నాను. పార్టీని వీడే సమయంలో ఇలా తప్పులు ఎత్తి చూప డం నా లక్షణం కాదు. హుందాతనం అనిపించు కోదని తెలుసు. అయితే, నిజాయితీగా ఆత్మపరిశీలన చేసుకుంటారనే ఇదంతా చెబుతున్నా' అని బీజేపీని వీడి టీఆర్ఎస్లో చేరిన మాజీ ఎంపీ రాపోల్ ఆనంద భాస్కర్ ఘాటు గా వ్యాఖ్యానించారు. ఈ మేరకు బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డాకు లేఖ రాశారు. కరోనా కాలంలో దినసరికూలీలు, అ సంఘటిత కార్మికులు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నా కేంద్ర ప్రభుత్వం పట్టించు కోలేదని విమర్శించారు. ఆక్సిజన్ కొరతతో ఎవ్వరూ చనిపోలేదని ప్రకటన చేసి అంతర్జాతీ యంగా మన దేశం నవ్వులపాలైందని పేర్కొన్నారు. సామాజిక భద్రత, న్యాయం, సాధికా రత అనే వాటినే బీజేపీ విస్మరించిందని విమర్శిం చారు. కులగణనకు బీజేపీ, కేంద్ర ప్రభుత్వం అడ్డు తగులుతున్నాయనీ, అప్పటి నుంచే ఆ పార్టీ పట్ల తనలో భయం మొదలైందని తెలిపారు. ఏక భాషా పెత్తనాన్ని ప్రోత్సహిస్తూ ప్రాంతీయ భాషలు, స్థానిక ప్రజల భావోద్వేగాలను చిన్నచూపుగా చూడటం, రాష్ట్రాల హక్కులను హరించడం బీజేపీ నేతలకు అలవాటుగా మారిందని విమర్శించారు. విభజన హామీల్లో తెలంగాణకు న్యాయపరంగా దక్కాల్సిన వాటిని కూడా ఆ పార్టీ తొక్కిపెడుతున్నదని ఆరోపిం చారు. చేనేత రంగంలోని సమస్యల పరిష్కారం కోసం ఎన్ని సూచనలు చేసినా పట్టించుకోలేదని విమర్శించారు. పైగా, వస్త్ర పరిశ్రమపై 12 శాతం జీఎస్టీ వేసి చేనేత కార్మికుల జీవనోపాధికి నష్టం కలిగేలా బీజేపీ చేసిందని తెలిపారు.