Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- యువతను మద్యానికి బానిసను చేస్తున్నారు
- బీజేపీ , టీఆర్ఎస్ కుట్రలను ఎదుర్కోవాలి
- నవంబర్ 1న మునుగోడులో మహిళాగర్జనను జయప్రదం చేయండి: టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి
నవతెలంగాణ -మునుగోడు
ఉప ఎన్నిక సందర్భంగా వందల కోట్ల డబ్బులు ఖర్చుపెట్టిన, మద్యం ఏరులై పారించిన బీజేపీకి మూడో స్థానం దక్కుతుందని సర్వే ఫలితాలు రావడంతో రాజగోపాల్‌రెడ్డికి చలి జ్వరం పటు ్టకుందని టీపీసీసీ అధ్యక్షులు ఎనముల రేవంత్‌రెడ్డి అన్నారు. నల్లగొండ జిల్లా మునుగోడు మండలం లోని కొంపల్లి గ్రామంలో బుధవారం విలేకరుల సమావేశంలో రేవంత్‌రెడ్డి మాట్లాడారు. నియోజక వర్గ వ్యాప్తంగా పాల్వాయి గోవర్థన్‌రెడ్డి చేసిన అభివృద్ధి తప్ప.. ఆ తర్వాత వచ్చిన ఎమ్మెల్యేలు అభివృద్ధి కోసం చేసిందేమీ లేదన్నారు. వారికి అవ కాశం ఇచ్చినప్పుడు చేయని అభివృద్ధిని.. ఇప్పుడు ఏం చేస్తారని ప్రశ్నించారు. ప్రాజెక్టులు పూర్తయితే తమ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని ఆశించిన ప్రజలకు ఎనిమిదేండ్లయినా డిండి ప్రాజెక్టు పూర్తి కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మునుగోడు నియోజకవర్గంలో ఏ గ్రామానికి వెళ్లినా గుంతల రోడ్లే కనిపిస్తున్నాయని, ప్రమాదాల బారిన పడుతున్నారని చెప్పారు.
గిరిజనులను అనాథలను చేయాలనే కుట్రతో అందమైన రాచకొండ భూములను సినిమా వాళ్లకు కట్టబెట్టాలని కేటీఆర్ చూస్తున్నారని ఆరోపించారు. బీజేపీ, టీఆర్ఎస్ అభ్యర్థులు సమస్యల చర్చకు రాకుండా మునుగోడు నియోజకవర్గంలో గందర గోళం సృష్టిస్తున్నారని విమర్శించారు. చదువు కోవాల్సిన యువతను మద్యానికి బానిసలను చేస్తు న్నారన్నారు.
ఈ ఉప ఎన్నికల్లో డబ్బు, మద్యంతో గెలవాలని రెండు పార్టీలు చూస్తున్నాయని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీని చంపేందుకు బీజేపీ, టీఆర్ఎస్ కుట్రలు పన్నుతున్నాయని, దీన్ని తిప్పికొట్టేందుకు రాష్ట్రంలోని కాంగ్రెస్ శ్రేణులంతా తమ అభ్యర్థి పాల్వాయి స్రవంతి గెలుపు కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. టీిఆర్‌ఎస్, బీజేపీ అభ్యర్థులు గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిన వారేనని.. ఈసారి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి స్రవంతి రెడ్డికి అవ కాశం ఇవ్వాలని ఓటర్లను కోరారు. నవంబర్ 1న మునుగోడు మండల కేంద్రంలో నిర్వహించనున్న మహిళాగర్జనను విజయవంతం చేయడానికి కాంగ్రెస్ శ్రేణులు కృషి చేయాలని చెప్పారు. ఈనెల 30న షాద్‌నగర్‌కు రాహుల్‌గాంధీ పాదయాత్ర వస్తుందని, కాంగ్రెస్ శ్రేణులు పాల్గొనాలని సూచిం చారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి, కాంగ్రెస్ రాష్ట్ర అధికార ప్రతినిధి పున్న కైలాస నేత, డీసీసీ అధ్యక్షుడు శంకర్ నాయక్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.