Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ప్రయాణీకులకు ప్రపంచ స్థాయి సౌకర్యాలను అందించేందుకు గానూ రూ.699 కోట్లతో అభివృద్ధి పనులను చేపట్టనున్నట్టు దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్(ఇన్చార్జి) అరుణ్‌కుమార్ జైన్ ప్రకటించారు. ఈ ప్రాజెక్టు కాంట్రాక్టును 36 నెలల్లో పూర్తిచేసేలా నిర్వహణా సంస్థకు సహకరించాలని అధికారులను ఆదేశించారు. సికింద్రాబాద్‌లోని దక్షిణ మధ్య రైల్వే కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌ను అప్‌గ్రేడ్ చేయడం చాలా అవసరమన్నారు. నాన్ సబర్బన్ గ్రేడ్-1 కేటగిరీ(రూ.500 కోట్ల ఆదాయం లేదా ఏటా 20 మిలియన్ల ప్రయాణికులను చేరవేసే స్టేషన్లు)లో ఈ స్టేషన్ ఉందనీ, సగటున రోజుకు 200 రైళ్ల ద్వారా 1.8 లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారని చెప్పారు. ఈ స్టేషన్ కాంప్లెక్స్‌ను ప్రపంచస్థాయిలో తీర్చిదిద్దడానికి మాస్టర్‌ప్లాన్ రూపొందించామని తెలిపారు.
మాస్టర్ ప్లాన్ ఇదే..
- జీప్లస్3 అంతస్తులతో ఉత్తరం వైపు కొత్త స్టేషన్ భవనం, జీప్లస్3 అంతస్తులతో దక్షిణంవైపు మరో భవనం.
- రెండు అంతస్తుల స్కై కన్కోర్స్ ( పై మార్గం నుంచి ప్రయాణీకులు బయటకు వెళ్లేందుకు)
- స్టేషన్‌కు ఉత్తరం వైపు మల్టీ-లెవల్ పార్కింగ్, దక్షిణ దిశలో భూగర్భ పార్కింగ్
- ట్రావెలేటర్లతో పాటు ఉత్తర, దక్షిణ వైపు భవనాల వద్ద రెండు నడక మార్గాల నిర్మాణం (7.5మీ)
- ఈస్ట్, వెస్ట్ మెట్రో స్టేషన్ల స్కైవేతో అనుసంధానం చేస్తూ ఉత్తరం వైపు నడిచి వెళ్లేందుకు ఏర్పాటు
- కొత్త స్టేషన్లో అవసరాలకు అనుగుణంగా సదుపాయాలు /వసతులు అందించేందుకు ప్లాట్‌ఫారాల పునరుద్ధరణ.
- ప్రయాణికులు, వాహనాల కదలికలను నియంత్రించడానికి ప్రవేశ , నిష్క్రమణ మార్గాలకు వేర్వేరుగా బ్లాక్‌లు
- 5000 కె.డబ్ల్యూ .పి సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటు.