Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలంగాణ రైతు సంఘం పిలుపు
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ శక్తులకు కట్టబెడుతున్న బీజేపీని మునుగోడు ఎన్నికల్లో ఓడిం చాలని తెలంగాణ రైతు సంఘం పిలుపునిచ్చింది. అక్కడ వామపక్షా లు బలపరుస్తున్న టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డిని గెలిపించా లని రైతులకు విజ్ఞప్తి చేసింది. ఈమేరకు తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు సారంపల్లి మల్లారెడ్డి, ప్రధాన కార్యదర్శి టి సాగర్ అన్నదాతలకు పిలుపు ఇచ్చారు. బుధవారం హైదరాబాద్‌లోని రైతు సంఘం రాష్ట్ర కార్యాల యంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు పి జంగారెడ్డి, డాక్టర్ అరిబండి ప్రసాద రావు, రాష్ట్ర సహాయ కార్యదర్శి మూడ్ శోభన్‌లతో కలిసి టీఆర్ఎస్ను గెలిపించాల ని కోరుతూ రూపొందించిన కరపత్రాలను వారు విడుదల చేశారు. అనంత రం మల్లారెడ్డి, సాగర్ మాట్లాడుతూ... 2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని చెప్పిన కేంద్ర ప్రభుత్వం రైతులకు వస్తున్న ఆదాయాన్ని దెబ్బతీసే విధానాలను కొనసాగిస్తున్నదని విమర్శించారు. కార్పొరేట్లకు వ్యవ సాయాన్ని ధారాదత్తం చేసే ఉద్దేశంతో మూడు నల్లచట్టాలు తెచ్చిందన్నారు. ఈ చట్టాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ముఖ్యంగా ఢిల్లీ కేంద్రంగా 13 నెలలు నిరవధిక పోరాటం చేసి 750 మంది రైతులు ప్రాణాలు బలిదానం చేసి, నల్ల చట్టాలను వెనక్కి కొట్టారని చెప్పారు. అయి నా బీజేపీ ప్రభుత్వం ఏదో రూపంలో కార్పొరేట్లకు వ్యవసాయ రంగాన్ని కట్ట బెట్టే ప్రయత్నం చేస్తు న్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు.