Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉదయం 6:30 గంటలకు మక్తల్ సబ్‌స్టేషన్ నుంచి రాహుల్ నడక
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
ఏఐసీసీ జాతీయ నేత రాహుల్‌గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర గురువారం నుంచి పున:ప్రారంభం కానుంది. జోగులాంబ గద్వాల జిల్లా మక్తల్ నియోజకకేంద్రంలోని సబ్‌స్టేషన్ నుంచి ఉదయం 6.30 గంటలకు ఆయన నడక ప్రారంభించనున్నారు. బుధవారం రాత్రి ఢిల్లీ నుంచి బయలుదేరి ఆయన శంషాబాద్ విమానాశ్రయంలో దిగి నేరుగా మక్తల్‌కు వెళ్లనున్నారు. ఈనెల 23న రాయచూర్ నుంచి ఆయన పాదయాత్ర తెలంగాణలోకి ప్రవేశించిన సంగతి తెలిసిందే. దీపావళి పండుగ, నూతనంగా ఏఐసీసీ అధ్యక్షులుగా ఎన్నికైన మల్లిఖార్జున ఖర్గే అధ్యక్ష బాధ్యతల స్వీకరణ కారణంగా రాహుల్ యాత్రకు బ్రేక్ ఇచ్చారు. ఈ క్రమంలో రోజుల విరామం తర్వాత గురువారం ఉదయం 6:30 గంటలకు జోడో యాత్ర తిరిగి ప్రారంభం కానుంది. వచ్చే నెల 7 వరకు తెలంగాణలో జోడోయాత్ర కొనసాగనుంది. రాహుల్ పాదయాత్రలో ప్రతి రోజు సాయంత్రం 7 గంటలకు కార్నర్ సమావేశం జరగనుంది. చివర రోజున భారీ సభ నిర్వహించేలా టీపీసీసీ ప్లాన్ చేస్తున్నది. యాత్ర నిర్వహణ కోసం ఇప్పటికే ఎనిమిది కమిటీలను నియమించింది. దీంతోపాటు రోడ్ మ్యాప్ కూడా సిద్ధం చేసిన విషయం తెలిసిందే. శంషాబాద్ మీదుగా చారిత్రాత్మకమైన చార్మినార్‌కు చేరుకోనుంది. అక్కడి నుంచి నాంపల్లి, నెక్లెస్ రోడ్ మీదుగా ఖైరతాబాద్, కూకట్పల్లి మీదుగా సంగారెడ్డికి చేరుకోనుంది. అక్కడి నుంచి జూక్కల్ మీదుగా మహారాష్ట్రలోకి ప్రవేశించనుంది.