Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రంగారెడ్డి జిల్లా అజీజ్‌నగర్‌లో అధికార పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే ఫాంహౌస్‌లో బుధవారం కొనుగోలు వ్యవహారంపై చర్చలు జరిగాయి. ఓ ఎమ్మెల్యే ఇచ్చిన సమాచారంతో సైబరాబాద్ పోలీసులు ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం కుట్రను భగం చేశారు. ఈ సందర్భంగా సైబారాబాద్ పోలీస్ కమిషనర్ స్టిఫెన్ రవీంద్ర మీడియాతో మాట్లాడుతూ.. ఫరీదాబాద్‌కు చెందిన సింహయాజులు, తిరుపతికి చెందిన రామచంద్రభారతిని హైదరాబాద్‌కు చెందిన నందకుమార్ ఇక్కడికి తీసుకొచ్చారని తెలిపారు. ఒక్కొక్క ఎమ్మెల్యేకు రూ.100 కోట్లతోపాటు కాంట్రాక్టర్లు, పదవుల ఇస్తామని వారు ఆఫర్ చేసినట్టు తెలుస్తోందన్నారు. కొనుగోలు వ్యవహారంలో పాల్గొన్న ముగ్గరు వ్యక్తులను అరెస్టు చేసి విచారణ చేపడుతామని స్పష్టం చేశారు. ఈ విషయం బహిర్గతం కావడంతో ఫామ్‌హౌస్ వద్దకు భారీగా పోలీసులు, స్ధానిక ప్రజలు పెద్దఎత్తున్న తరలివచ్చారు. ఏ విధంగా ఎమ్మెల్యేలను ట్రాప్ చేశారో విచారణ జరిపి పూర్తి స్థాయిలో వెల్లడిస్తామని సీపీ వివరించారు.