Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రజల ఆత్మగౌరవాన్ని అమ్ముకున్న ఆయన్ను ఓడించండి
- కమ్యూనిస్టులపై నోరు పారేసుకుంటున్నరు
- బీజేపీ మూడో స్థానానికే పరిమితం : సీపీఐ (ఎం) కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు
నవతెలంగాణ - చౌటుప్పల్ రూరల్
మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఓటమి భయం పట్టుకుందని, అందుకే కమ్యూనిస్టులపై నోరు పారేసుకుంటున్నారని సీపీఐ (ఎం) కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు అన్నారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా నల్లగొండ జిల్లా మునుగోడు నియోజకవర్గం చౌటుప్పల్ మండలంలోని నేలపట్ల, మందోల్లగూడెం, చిన్న కొండూరు గ్రామాల్లో గురు వారం ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా సీతారాములు మాట్లాడుతూ.. కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి మునుగోడు ప్రజల ఆత్మగౌరవాన్ని బీజేపీకి తాకట్టు పెట్టారని విమర్శించారు. ప్రజాస్వామ్యాన్ని ధ్వంసం చేస్తున్న బీజేపీిని ఓడించాలని ఓటర్లను కోరారు. బీజేపీకి రూ.18 వేల కోట్ల కాంట్రాక్టుకు అమ్ముడుపోయిన రాజగోపాల ్రెడ్డికి ఓటు అడిగే నైతిక అర్హత లేదన్నారు. డబ్బులతో ఎన్నికల్లోకి వచ్చి గెలువాలనే కుటిల బుద్ధి రాజగోపాల్రెడ్డిదని విమర్శించారు. తెలంగాణలో బీజేపీ మత విద్వేషాలు రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. మునుగోడు ప్రజలను పట్టించుకోని రాజగోపాల్రెడ్డి ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతున్నారని ప్రశ్నించారు. కోమటిరెడ్డి బ్రదర్స్ ఉమ్మడి నల్లగొండ జిల్లాలో రాజకీయ వ్యభిచారం చేస్తున్నారని విమర్శించారు. మును గోడులో టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసి కూసుకుంట్లను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి, మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు, సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఎుండి.జహంగీర్, డీవైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి ఆనగంటి వెంకటేశం, జిల్లా కార్యదర్శి గడ్డం వెంకటేశం, ఎంపీటీసీ తడక పారిజాత మోహన్, నాయకులు చింతల సుదర్శన్, ఆంజనేయులు, శంకర్, గ్రామ సర్పంచ్ చౌటవేణు తదితరులు పాల్గొన్నారు.
ప్రజలపై భారాలు మోపుతున్న బీజేపీని ఓడించండి సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు మల్లు లక్ష్మి
అన్ని రకాల నిత్యావసరాల ధరలు పెంచి ప్రజలపై భారాలు మోపుతున్న బీజేపీని మునుగోడులో చిత్తుగా ఓడించాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు మల్లు లకిë చెప్పారు. మతోన్మాద విధానాలు అవలంబిస్తూ, ప్రజల మధ్య వైశాల్యాలు పెంచుతున్న బీజేపీని తెలంగాణలో అడుగుపెట్టనివ్వొద్దని సూచించారు. చౌటుప్పల్ మండలం ఎస్ లింగోటం గ్రామంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డితో కలిసి ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గెలిచిన ఎమ్మెల్యే ప్రజల్లో లేకపోయినా, ఓడిపోయిన కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి నిత్యం ప్రజల్లో ఉన్నారన్నారు. నియోజకవర్గంలో ఎక్కడికి వెళ్లినా ప్రజలు కారు గుర్తుకే ఓటు వేస్తామని అంటున్నారని తెలిపారు. కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం కాంట్రాక్టులు తీసుకొని బీజేపీలోకి పోయారని విమర్శించారు. దేశంలో నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెంచుతున్న బీజేపీకి మునుగోడు ఎన్నికల్లో ఓటు అడిగే హక్కు లేదన్నారు. గ్యాస్ సిలిండర్ ధర రూ.400 నుంచి 1200 చేసిన ఘనత బీజేపీ ప్రభుత్వానిదన్నారు. మునుగోడు గడ్డ వెట్టి చాకిరీకి వ్యతిరేకంగా పోరాటం చేసిన వారసత్వం కలిగిన అడ్డా అన్నారు. బీజేపీ ఆటలు ఇక్కడ సాగవని హెచ్చ రించారు. కమ్యూనిస్టుల మద్దతుతో మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలుపు ఖాయమని చెప్పారు.