Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తగ్గించాలని మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన
నవ తెలంగాణ:పెంచిన గ్యాస్, నిత్యావసర ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ నల్లగొండ జిల్లా మునుగోడు మండల కేంద్రంలో మహిళా సంఘాల ఆధ్వర్యంలో గురువారం అంబేద్కర్ విగ్రహం వద్ద ఖాళీ సిలిండర్లు పెట్టి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా గూడపూర్ సర్పంచ్ కంచి జ్యోతి మాట్లాడుతూ.. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన ఎనిమిదేండ్లలో రూ.400 ఉన్న గ్యాస్ సిలిండర్ను రూ.1200 పెంచి సామాన్య ప్రజలపై భారం మోపిందన్నారు. నిరుపేద కుటుంబానికి చెందిన ప్రజలు రోజంతా కూలి చేస్తే రూ.200 వస్తే.. పెరిగిన ధరల నేపథ్యంలో ఏమీ రావడం లేదన్నారు. నిత్యావసర వస్తువుల ధరలు పెంచడంతో కుటుంబ పోషణ భారమై తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్, నిత్యావసర వస్తువుల ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో మహిళా సంఘాల ఆధ్వర్యంలో పెద్దఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మహిళా సంఘాల సభ్యులు వంటపాక వెంకటమ్మ, మోగుదాల శ్యామల, ప్రేమలత, యాదమ్మ, వెంకటమ్మ, మమత తదితరులు పాల్గొన్నారు.