Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎన్నికల కమిషన్‌కు టీఎస్ఆర్టీసీ ఎస్‌డబ్ల్యూఎఫ్ లేఖ
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
ఎన్నికల నియమావళి అమల్లో ఉన్న నేపథ్యంలో ఆర్టీసీ కార్మికుల వేతన ఒప్పందానికి అనుమతి ఇవ్వాలని టీఎస్ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ (ఎస్‌డబ్ల్యూఎఫ్) రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి విజ్ఞప్తి చేసింది. 46 వేల మంది ఆర్టీసీ కార్మికులకు 2017 నుంచి వేతన ఒప్పందం జరగలేదని ఆ లేఖలో పేర్కొన్నారు. ఈ మేరకు ఎస్‌డబ్ల్యూఎఫ్ రాష్ట్ర ప్రచార కార్యదర్శి పీ రవీందర్‌రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర కార్యదర్శి జీఆర్ రెడ్డి, ఉపాధ్యక్షులు కే గీత, గ్రేటర్ హైదరాబాద్ జోన్ అధ్యక్షులు ప్రకాష్‌లు వినతిపత్రం అందచేశారు. 2017 ఏప్రిల్ 1 నుంచి ఒక వేతన సవరణ, 2021 ఏప్రిల్ 1 నుంచి మరో వేతన సవరణ జరగాల్సి ఉందని పేర్కొన్నారు. ఇవి అమల్లోకి రాకపోవడం వల్ల కార్మికులు ఆర్థికంగా అవస్థలు పడుతున్నారని తెలిపారు. కార్మిక సంఘాలుగా తాము చేసిన అనేక ఆందోళనలు, విజ్ఞప్తుల అనంతరం ప్రభుత్వం వేతన ఒప్పందానికి సుముఖత వ్యక్తం చేసిందనీ, అయితే మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నికల కోడ్ ఆటంకంగా ఉందని తెలియజేస్తూ, దానినుంచి మినహాయింపు కోరుతూ ఎలక్షన్ కమిషన్‌కు లేఖలు ఇచ్చారని ప్రస్తావించారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరూ 30 శాతం పెరిగిన వేతనాలు అనుభవిస్తున్నారనీ, కేవలం ఆర్టీసీ కార్మికులకు మాత్రమే 2017 నుండి ఎటువంటి పెరుగుదల లేకుండా ఉన్నదని ఆ లేఖలో వివరించారు. ఆర్టీసీ కార్మికుల కుటుంబాల ప్రయోజనాలను దష్టిలో ఉంచుకొని, వేతన ఒప్పందం కోసం ప్రభుత్వం కోరిన విధంగా ఎన్నికల నిబంధనావళి నుండి మినహాయింపు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
మునుగోడు ఎన్నికలకంటే ముందే
ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
మునుగోడు ఉప ఎన్నికలకంటే ముందే రాష్ట్రప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల సమస్యల్ని పరిష్కరించాలని తెలంగాణ జాతీయ మజ్దూర్ యూనియన్ (టీజేఎమ్‌యూ) ప్రధాన కార్యదర్శి కే హన్మంతు ముదిరాజ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావుకు లేఖ రాసినట్టు తెలిపారు. 2017 నుంచి ఆర్టీసీ ఉద్యోగులకు వేతన సవరణ జరగలేదనీ, పనిభారం పెరిగి అనేక ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు.
కార్మిక సంఘాలుగా తాము డిమాండ్ల సాధన కోసం ఎన్ని పోరాటాలు, ఆందోళనలు చేసినా స్పందించలేదనీ, ఇప్పుడు మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో ఆర్టీసీ కార్మికులను పిలిపించుకొని సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చిన విషయాన్ని ప్రస్తావించారు. కానీ ఆర్టీసీలో ఇప్పటికీ యూనియన్లను అనుమతించ కపోవడం మరో మూడు డిఏలు బకాయి ఉండటం సహా పలు సమస్యల్ని ఆ లేఖలో పేర్కొన్నారు.