Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బంజారాహిల్స్
బంజారాహిల్స్ పోలీస్టేషన్లో పని చేస్తున్న ప్రొబెషనరీ ఎస్ఐ రమణ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. ఇందుకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలం, వాసుదేవపురం గ్రామానికి చెందిన రమణ 2020లో పోలీస్‌శాఖలో ట్రైనీ ఎస్ఐగా చేరారు. ప్రస్తుతం ప్రొబేషనరీ ఎస్ఐగా బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో పనిచేస్తున్నారు. మరో ఎస్ఐ ప్రతాప్, ముగ్గురు స్నేహితులతో కలిసి చిక్కడపల్లిలోని అశోక్‌నగర్‌లో నివాసముంటున్నారు. బుధవారం రాత్రి 10 గంటల సమయంలో రమణ బయటకు వెళ్లారు. మళ్లీ తిరిగి రాలేదు. ఈ క్రమంలో గురువారం ఉదయం మౌలాలి-చర్లపల్లి రైల్వేస్టేషన్ల మధ్య బీ క్యాబీన్ ఏరియాలో రైలు పట్టాలపై ఓ వ్యక్తి మృతదేహాన్ని రైల్వే కీమ్యాన్ వెంకటేశ్వర్రావు గుర్తించారు. వెంటనే ఆయన సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ అధికారులకు విషయం చెప్పారు. వారు జీఆర్పీ పోలీసులకు సమాచారం అందజేశారు. జీఆర్పీ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహం వద్ద లభించిన సెల్‌ఫోన్ ఆధారంగా ఎస్ఐ రమణగా గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గాంధీ ఆస్పత్రికి తరలించారు. అయితే, ఎస్ఐ రమణ ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడనే వివరాలు తెలియలేదు. పోలీసులు కేసు దర్యాప్తు ప్రారంభించామని జీఆర్పీ సీఐ ఎం.శ్రీని తెలిపారు.