Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పత్రాల సంఖ్యను కుదించిన టీఎస్ఎస్పీడీసీఎల్
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
విద్యుత్ సర్వీస్ (కరెంటు మీటర్) పేరు మార్పు ప్రక్రియను సులభతరం చేస్తున్నట్టు టీఎస్ఎస్పీడీసీఎల్ సీఎమ:డీ జీ రఘుమారెడ్డి తెలిపారు. గహ (కేటగిరీ - 1), గహేతర (కేటగిరీ - 2) విద్యుత్ సర్వీస్ కనెక్షన్ల యాజమాన్య హక్కుల బదలాయింపు, పేరు మార్పు ప్రక్రియలో ధృవీకరణ పత్రాల సంఖ్యను కుదించినట్టు తెలిపారు. ఆయా పత్రాల వివరాల సంస్థ వెబ్‌సైట్‌తో పాటు ఇంటిగ్రేటెడ్ కస్టమర్ సర్వీస్ సెంటర్/ కస్టమర్ సర్వీస్ సెంటర్లలో సమర్పించి సర్వీస్ కనెక్షన్ పేరు మార్చుకోవచ్చని వివరించారు. సెల్ఫ్ అసిస్టెడ్ గుర్తింపు కార్డు, వంద రూపాయల నాన్ జ్యూడిషియల్ స్టాంప్ పేపర్ మీద ఇండెమ్నిటి బాండ్(ఈ ఫార్మటు సంస్థ వెబ్సైట్లో ఉంది), ప్రస్తుత దరఖాస్తుదారుని పేరు మీద గల స్వీయ ధ్రువీకరణ చేసిన రిజిస్టర్డ్ సేల్ డీడ్ లేదా పార్టనర్షిప్ డీడ్ లేదా విల్ డీడ్ లేదా ఏదైనా యాజమాన్య హక్కు ధవీకరించే పత్రాన్ని జతచేయాలి. వాటితో పాటు కొన్ని నిబంధనల్ని కూడా అనుసరించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఏదైనా సంస్థ పేరు మీద గాని/ అవగాహనా ఒప్పందం/ భాగస్వామ్య ఒప్పదం ఉంటే ఆ కంపెనీ ఇచ్చే అధికార పత్రం పొందుపరచాలని తెలిపారు. అలాగే ఉమ్మడి యాజమాన్యం ఉంటే సంస్థ నిర్దేశించిన విధంగా రూ.10 నాన్ జ్యూడిషల్ స్టాంప్ పేపర్ మీద ఇతర భాగస్వామ్యుల నిరభ్యంతర పత్రం పొందుపరచాలి. పాత యజమాని చనిపోతే చట్ట పరమైన వారసుల లీగల్ హెయిర్ సర్టిఫికెట్ స్వీయ ధ్రువీకరణ చేసి పొందుపరచాలని పేర్కొన్నారు. దరఖాస్తురుసుం రూ. 25తో పాటు అదనంగా జీఎస్టీ కూడా చెల్లించాల్సి ఉంటుంది. ఈ మేరకు క్షేత్రస్థాయి అధికారులు తమ సిబ్బందికి అవగాహన కల్పించాలని ఆదేశించారు. దరఖాస్తు వచ్చిన ఏడు రోజుల్లో వాటి ఆమోదం, తిరస్కరణను తెలపాలని చెప్పారు.