Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
'టీఎస్పీఎస్సీ సభ్యుల నియామక ప్రక్రియ ఎలా ఉంటుందో చెప్పాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. నియామక ప్రక్రియ ఏమైనా ఉందా లేక మీ ఇష్టం వచ్చినట్టుగా నియమిస్తున్నారా? అని ప్రశ్నించింది. అర్హతలున్న వ్యక్తులను పోస్టులు ఖాళీలుంటే దరఖాస్తు చేసుకోవాలని ఆహ్వానిస్తున్నారా? అని కూడా అడిగింది. టీఎస్పీఎస్సీలో పలువురు సభ్యుల నియామకం చట్టవిరుద్ధంగా జరిగిందంటూ దాఖలైన పిల్‌ను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ సీవీ భాస్కర్‌రెడ్డి ధర్మాసనం గురువారం విచారించింది. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది సత్యంరెడ్డి వాదనలు వినిపించారు. రామావత్ ధన్సింగ్, బండి లింగారెడ్డి, సుమిత్రా ఆనంద్, కారం రవీందర్‌రెడ్డి, అరవిల్లి చంద్రశేఖర్‌రావు, ఆర్.సత్యనారాయణలను టీఎస్పీఎస్సీ సభ్యులుగా నియమించడం చెల్లదని కాకతీయ యూనివర్సిటీ రిటైర్డు ప్రొఫెసర్ ఏ. వినాయక్‌రెడ్డి పిల్‌పై విచారణ నవంబర్ 14కు వాయిదా పడింది.
పబ్స్ ఇంప్లీడ్ పిటిషన్లపై వాదన
రాత్రి 10 గంటల తర్వాత మ్యూజిక్‌ను ఆపాలంటూ చెప్పడం ప్రాథమిక హక్కులకు ఏ విధంగా ఉల్లంఘన అవుతుందో చెప్పాలని పబ్‌ల నిర్వాహకులను హైకోర్టు ప్రశ్నించింది. అత్యవసర పరిస్థితు ల్లో తప్ప రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు మ్యూజిక్ సౌండ్ పెట్టడానికి వీల్లేదంటూ సుప్రీంకోర్టు చెప్పిన విషయాన్ని గుర్తుచేసింది. అందు కు విరుద్ధంగా తమ నుంచి ఆదేశా లను ఏ విధంగా ఆశిస్తారంటూ జస్టిస్ కన్నెగంటి లలిత ప్రశ్నించారు.