Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ధర్మం ముసుగులో కుట్రలు చేస్తున్న బీజేపీని మునుగోడు ఎన్నికల్లో ఓడించాలని అఖిల భారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్) రాష్ట్ర సమితి పిలుపునిచ్చింది. ఈ మేరకు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వలి ఉల్లా ఖాద్రి, కె ధర్మేంద్ర గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలపై బీజేపీ కుట్రలు చేస్తున్నదని విమర్శించారు. దేశం కోసం ధర్మం కోసం ప్రగల్భాలు పలికే మఠాధిపతులు, పీఠాధిపతులను ప్రభుత్వాలను కూల్చే పని చేయడం సిగ్గుచేటని తెలిపారు. ఇలాంటి చర్యలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అంగట్లో సరుకుగా ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు.