Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
రాష్ట్రంలోని యువతకు విదేశాల్లో మరిన్ని ఉపాధి అవకాశాలు కల్పించడానికి చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు గురువారంనాడాయన బీఆర్కే భవన్లో ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. శిక్షణ ద్వారా సామర్థ్యాన్ని పెంపొందించాలని చెప్పారు. విదేశాల్లో ఉద్యోగ మార్కెట్‌ను మెరుగుపర్చేందుకు తెలంగాణ ఓవర్ సీస్ మ్యాన్ పవర్ కంపెనీ (టీఓఎమ్సీఓఎమ్) ప్రాజెక్ట్ మానిటరింగ్ యూనిట్, అడ్వయిజరీ కౌన్సిల్ ఏర్పాటుపై దష్టి పెట్టాలని ఆదేశించారు. విదేశాల్లో ఎక్కువ మంది నర్సింగ్ విద్యార్థులు పరీక్షలు రాసేందుకు వీలు కల్పించాలనీ, దానికోసం కళాశాలల్లో ప్రోత్సాహక క్యాంపులు నిర్వహించాలని చెప్పారు.