Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీఎస్పీఎస్సీ వెబ్సైట్లో అభ్యర్థుల ఓఎంఆర్లు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
గ్రూప్-1 ప్రిలిమినరీ రాతపరీక్షకు సంబంధించిన ప్రాథమిక కీని శుక్రవారం విడుదల చేయాలని తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) నిర్ణయించినట్టు తెలిసింది. అభ్యర్థుల ఓఎంఆర్ పత్రాలను సైతం టీఎస్పీఎస్సీ వెబ్సైట్లో అందుబాటులో ఉంచే అవకాశమున్నది. 503 పోస్టుల భర్తీకి తెలంగాణ తొలి గ్రూప్-1 నోటిఫికేషన్‌ను టీఎస్పీఎస్సీ ఏప్రిల్ 26వ తేదీన విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈనెల 16న ఉదయం 10.30 నుంచి మధ్యాహ్న ం ఒంటిగంట వరకు పరీక్షను నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా 3,80,081 మంది అభ్యర్థులు దరఖాస్తు చేయగా, వారిలో 2,86,051 (75 శాతం) మంది అభ్యర్థులు హాజరయ్యారు. అయితే 1:50 చొప్పున ప్రిలిమ్స్ నుంచి గ్రూప్-1 మెయిన్స్‌కు అభ్యర్థులను ఎంపిక చేస్తామం టూ గతంలోనే టీఎస్పీఎస్సీ స్పష్టత ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో 2,86,051 మంది అభ్యర్థుల్లో 25,150 మెయిన్స్‌కు ఎంపికయ్యే అవకాశమున్నది. మల్టీ జోన్లు, రిజర్వేషన్లు, జెండర్ ఆధారంగా వారి ఎంపిక ప్రక్రియ జరగనుంది. అయితే గ్రూప్-1 ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్‌కు ఎంపిక చేసేందుకు అభ్యర్థులకు కటాఫ్ మార్కులుండ బోవని ప్రకటించింది. ప్రాథమిక కీపై అభ్యర్థుల నుంచి అభ్యంతరాలను టీఎస్పీఎస్సీ స్వీకరించనుంది. ఆ తర్వాత నెల రోజుల్లో గ్రూప్-1 ప్రిలిమ్స్ ఫలితాలను వెల్లడించడంతోపాటు మెయిన్స్‌కు అభ్యర్థులను ఎంపిక చేసే అవకాశమున్నది. ప్రిలిమినరీ ప్రాథమిక కీని శుక్రవారం వీలుకాకపోతే శనివారం విడుదల చేస్తామని ఓ అధికారి వివరించారు.