Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హైకోర్టులో బీజేపీ పిటిషన్
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
రాష్ట్రంలో రాజకీయ దుమారానికి కారణమైన నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోళ్ల వ్యవహారం న్యాయస్థానానికి చేరింది. దీనిపై బీజేపీ, టీఆర్ఎస్ ఒకరిపై ఒకరు విమర్శనాస్త్రాలు సంధిస్తూ, ఆరోపణలు చేసుకుంటున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్ర బీజేపీ నాయకులు ఈ కేసు విచారణను సీబీఐ కి అప్పగించేలా ఆదేశాలు ఇవ్వాలనీ, లేకుంటే న్యాయవిచారణ జరిపించాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై శుక్రవారం విచారణ జరిగే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈ ఘటనపై బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఎన్ రామచంద్రరావు, ఆపార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి వై రచనారెడ్డి కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాసారు. ఎమ్మెల్యేల కొనుగోళ్ల వ్యవహారంపై కేంద్ర ఎన్నికల సంఘం స్వతంత్రంగా విచారణ జరిపి, మునుగోడు ఎన్నికలు నిష్పక్షపాతంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరారు.