Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 23న ఛలో ఢిల్లీ
- విద్యుత్ సవరణ బిల్లును వెనక్కి తీసుకోవాలి
- మోడీ సర్కారుకు బుద్ధి చెప్పి తీరుతాం:
విద్యుత్ ఉద్యోగుల రాష్ట్ర స్థాయి సదస్సులో నాయకులు
టీఆర్ఎస్, తెలంగాణ రైతు సంఘం మద్దతు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
విద్యుత్ రంగాన్ని ప్రయివేటీకరించేందుకు ఉద్దేశించిన సవరణ బిల్లును ఉపసంహరించు కోవాలని పలువురు నాయకులు డిమాండ్ చేశారు. శుక్రవారం హైదరాబాద్లో తెలంగాణ స్టేట్ పవర్ ఎంప్లాయీస్ జేఏసీ ఆధ్వర్యంలో మింట్ కాంపౌండ్ నుంచి ఖైరతాబాద్ విశ్వేశ్వరయ్య భవన్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. బీజేపీ సర్కారు కార్పొ రేట్ అనుకూల, ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఫ్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. వేలాది మందిగా తరలివచ్చిన వారితో ఆ ప్రాంతం నిండిపోయింది. అనం తరం జేఏసీ నాయకుడు సాయిబాబా అధ్యక్షతన రాష్ట్ర స్థాయి సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో ఆల్ ఇండియా పవర్ ఇంజినీర్స్ ఫెడరేషన్ చైర్మెన్ శైలేంద్ర దూబే మాట్లాడుతూ నవంబర్ 23న చేపట్టనున్న ఛలో ఢిల్లీ నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలు పునిచ్చారు. విద్యుత్ సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానించి నందకు సీఎం కేసీఆర్కు ధన్యవాదా లు తెలిపారు. విద్యుత్ రంగాన్ని కాపాడట మంటే దేశాన్ని కాపాడటమేనని తెలిపారు. ఈ పోరాటం కేవలం విద్యుత్ ఉద్యోగు ల కొరకు మాత్రమే కాదనీ, ప్రజలందరి కోసమని చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లోనూ బిల్లును ఆమోదించ నీయబోమన్నారు. రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తున్న క్రమంలో ఇక ప్రయివేటు రాకతో పోటీ పెరుగుతుందని బీజేపీ సర్కారు చెబుతున్న దాంట్లో హేతుబద్ధత ఎక్కడుందని ప్రశ్నించారు. కేవలం లాభదాయక రంగాల్లోకి మాత్రమే ప్రయివేటు రంగం ప్రవేశిస్తుందనీ, దాని ద్వారా ప్రయోజ నాలుండబోవని స్పష్టం చేశారు. నష్టాల కారణంగా ప్రయివేటీకరిస్తున్నామని చెబుతున్న దాంట్లో కూడా వాస్తవం లేదని కొట్టి పారేశారు. దక్షిణాది లో అన్ని రాష్ట్రాల కన్నా పుదుచ్ఛేరిలో ధరలు తక్కువగా ఉండటమే అక్కడి నష్టాలకు కారణమ న్నారు. రైతు ఉద్యమం విజయం సాధించినట్టుగానే విద్యుత్ ఉద్యమం కూడా మోడీ మెడలు వంచి తీరుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఆల్ ఇండియా ఫెడరేషన్ ఆఫ్ పవర్ ఎం ప్లాయీస్ యూని యన్ ప్రదాన కార్యదర్శి మోహన శర్మ మాట్లాడుతూ వినియోగదారులను ఎంపిక చేసుకునే అవకాశం ప్రయి వేటు రంగానికి అప్పగించడమనేది సవరణ బిల్లులో ఉన్న అత్యంత ప్రమాదకరమైన అంశమని ఆందోళన వ్యక్తం చేశారు. డిస్కంల మౌలిక వసతుల విలువ రూ.70 లక్షల కోట్లనీ, అలాంటి విలువ కలిగిన వాటిని ప్రయివేటుకు అప్పగిస్తున్నారని విమ ర్శించారు. తద్వారా కోట్లాది మంది వ్యవవసాయ దారులు, 25 కోట్ల మంది చిన్న వ్యాపారులు దెబ్బతింటారని తెలిపారు. దీంతో ఆహార వస్తువుల ధరలు పెరిగి సామాన్యునికి ఇబ్బందిగా మారుతుం దని చెప్పారు. ఛలో ఢిల్లీ కార్యక్రమం తర్వాత అవసరమైతే నిరవధిక సమ్మెకు వెళతామని హెచ్చరించారు.
టీఆర్ఎస్ మద్ధతు
విద్యుత్ ఉద్యోగుల పోరాటానికి టీఆర్ఎస్ మద్ధతు తెలిపింది. రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు బోయిన పల్లి వినోద్ కుమార్ మాట్లాడుతూ ప్రజాస్వామ్య విలువ లను, పార్ల మెంటరీ సంప్రదాయాలను పక్కనపెట్టి బిల్లు ను ఆమోదించుకునేందుకు బీజేపీ ప్రయత్నిస్తున్నదని విమ ర్శించారు. ఉమ్మడి జాబితాలో ఉన్న విద్యుత్ అంశంపై రాష్ట్రాలను సంప్రదించకుండా నిర్ణయాలు తీసుకుంటుం దని ఆగ్రహం వ్యక్తం చేశారు. కోట్లాది మంది ప్రజల కష్టా ర్జితంతో నిర్మితమైన విద్యుత్ రంగాన్ని కొద్ది మందికి కట్ట బెట్టేందుకు ప్రయత్నిస్తున్నదన్నా రు. విద్యుత్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా పార్లమెంటులో, బయట టీఆర్ఎస్ ఎంపీలు పోరాటంలో భాగస్వాములవు తారని హామీ ఇచ్చారు. కొంత మంది వ్యక్తుల ప్రయోజనాల కోస మే బీజేపీ ప్రయత్నిస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రైతు సంఘం మద్ధతు
విద్యుత్ ఉద్యోగుల పోరాటానికి తెలంగాణ రైతు సంఘం మద్ధతు ప్రకటించింది. ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.సాగర్ మాట్లాడుతూ నవంబర్ 23న జరిగే ఛలో ఢిల్లీతో పాటు, నవంబర్ 26న జరిగే ఛలో రాజ్ భవన్ కార్యక్రమంలో భాగస్వాము లవుతామని తెలిపారు. విద్యుత్ సవరణ బిల్లుతో ఉద్యోగులు, కార్మకులు, రైతులతో పాటు ప్రతి విద్యుత్ వినియోగదారునికి నష్టమేనని స్పష్టం చేశారు. 13 నెలల పాటు సాగిన రైతు ఉద్యమం సందర్భం గా విద్యుత్ సవరణ బిల్లును వెనక్కి తీసుకుంటామంటూ మోడీ సర్కారు తుంగలో తొక్కిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోరాటంతో కేంద్ర ప్రభుత్వానికి బుద్ధి చెప్పి తీరుతామని హెచ్చరించారు. ఆల్ ఇండియా పవర్ ఇంజినీర్స్ ఫెడరే షన్ సెక్రెటరీ జనరల్ రత్నాకర్ రావు, అభిమన్యు ధంకర్, ఇ.శ్రీధర్, పి.బీసీ రెడ్డి, ఆర్.సుధాకర్ రెడ్డి, తులసి నాగరాణి, ఎం.కరణాకర్ రెడ్డి, ఎం.రంజీ, ఎం. నెహ్రూ, ఎం.శివశంకర్, కుమార చారి, సి.భాను ప్రకాష్, కె.కుమార స్వామి, జ్యోతి రాణి, బి.ఈశ్వర్ గౌడ్, పి.నారా యణ నాయక్, కె.అంజయ్య, సీహెచ్. చలపతి రావు, సురేష్, కిశోరె కుమార్, కె.కిరణ్ కుమార్. జె.ఎల్.జనప్రియ పాల్గొన్నారు.