Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రజలు దీనిని గుర్తించి ప్రశ్నించాలి
- తెలంగాణలో ఎమ్మెల్యేల కొనుగోళ్ల అంశంపై నటుడు ప్రకాశ్ రాజ్
హైదరాబాద్ : తెలంగాణలో అలజడి సృష్టించిన ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై నటుడు ప్రకాశ్ రాజ్ స్పందించారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి అలజడి సష్టించడం బీజేపీకి అలవాటుగా మారిందన్నారు. అదే పని ఇప్పుడు తెలంగాణలోనూ చేస్తున్నారన్నారు. ''ఆ దొంగలకు వేరే పని తెలీదు. ఇక్కడ కొత్తగా ఏమీ చెయ్యటం లేదు. కర్ణాటక, మహారాష్ట్ర.. ఇలా అన్ని చోట్లా వారు ఇలానే చేస్తున్నారు. ఈ విషయాన్ని ప్రజలు గమనించాలి. బీజేపీ, మోడీ.. ఇలా ఎవరైనా ఇలాంటి పనిచేస్తున్నప్పుడు ప్రజలు, మీడియా ప్రశ్నించాలి'' అని ప్రకాశ్ రాజ్ చెప్పారు. తెలంగాణ సీఎం కేసీఆర్ కొన్ని విషయాల్లో చాలా స్ట్రాంగ్‌గా ఉంటారనీ, ప్రస్తుత పరిస్థితుల్లో అలా ఉండక తప్పదన్నారు. తెలంగాణ ప్రజలు ఆయనను అర్థం చేసుకొని కేసీఆర్ వెంట ఉంటారని ప్రకాశ్ రాజ్ అన్నారు.