Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్ర మంత్రి పీయూష్ గోయల్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
నాణ్యత, ఎగుమతులు భారతదేశ ఆర్థిక వ్యవస్థకు కీలకమనీ, వాటి విషయంలో ఎప్పుడూ రాజీ పడొద్దని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ సూచించారు. శుక్రవారం హైదరాబాద్లో ఎఫ్ టీసీసీఐ ఇంటరాక్టివ్ సమావేశంలో మాట్లాడుతూ భారతదేశంలో అమ్ముడవుతున్న బంగారంలో 90 శాతం హాల్మార్క్ ఉందని తెలిపారు. నాణ్యత తక్కువ ధరతో అత్యధిక రాబడిని ఇస్తుందని తెలిపారు. ఎగుమతుల్లో ఉండే నాణ్యత కలిగిన ఉత్పత్తులు దేశంలోనూ ఉండేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. భారతీయులు తమ బడ్జెట్లో కనీసం ఐదు శాతం స్థానిక వస్తువులకు ఖర్చు చేయాలనీ, కళాకారులను ప్రోత్సహించాలని సూచించారు. ఎఫ్టీసీసీఐ అధ్యక్షులు అనిల్ అగర్వాల్ మాట్లాడుతూ భారతీయ కంపెనీలను గ్లోబల్ వాల్యూ చెయిన్లోకి చేర్చేందుకు 13 రంగాల కోసం 27 బిలియన్లవి శాతానికి తగ్గించడంతో దేశీయ,అంతర్జాతీయ పెట్టుబడిదారులను ఆకర్షిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎఫ్టీసీసీఐ ఇండిస్టియల్ డెవలప్మెంట్ కమిటీ చైర్పర్సన్ శ్రీనివాస్ గరిమెళ్ల తదితరులు పాల్గొన్నారు.