Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ముగిసిన ఎస్సీఈఆర్టీ రాష్ట్రస్థాయి సాంస్కృతిక పోటీలు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణా సంస్థ (ఎస్సీఈఆర్టీ), జనాభా విద్యావిభాగం ఆధ్వర్యంలో రెండురోజులపాటు హైదరాబాద్‌లో నిర్వహించిన రాష్ట్రస్థాయి సాంస్కృతిక పోటీలు శుక్రవారం ముగిశాయి. ఈ మేరకు ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ ఎం రాధారెడ్డి ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రస్థాయి పాత్రాభినయం (రోల్‌ప్లే), జానపద నృత్యాలు (ఫోక్ డ్యాన్స్) విభాగాల్లో పోటీలు నిర్వహించామని తెలిపారు. జిల్లా స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచిన జట్లు ఈ పోటీల్లో పాల్గొన్నాయని పేర్కొన్నారు. రాష్ట్రస్థాయి పాత్రాభినయం పోటీల్లో హన్మకొండ జిల్లాలోని ఐనవోలు కేజీబీవీ ప్రథమ స్థానం, రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్ జెడ్పీహెచ్ఎస్ ద్వితీయ స్థానం, యాదాద్రి భువనగిరి జిల్లా ప్రభుత్వ ఉన్నత పాఠశాల (బాలికలు) తృతీయ స్థానంలో నిలిచాయని వివరించారు. రాష్ట్రస్థాయి జానపద నృత్యాల పోటీల్లో మేడ్చల్ జిల్లా ఎల్లమ్మబండ జెడ్పీహెచ్ఎస్ ప్రథమ స్థానం, నాగర్‌కర్నూల్ జిల్లా ఇంద్రకల్ జెడ్పీహెచ్ఎస్ ద్వితీయ స్థానం, మంచిర్యాల జిల్లా సుద్దాల జెడ్పీహెచ్ఎస్ తృతీయ స్థానంలో నిలిచాయని తెలిపారు. ఈ పోటీల్లో ప్రథమ స్థానంలో నిలిచిన జట్లు డిసెంబర్ ఆరు నుంచి తొమ్మిది వరకు శ్రీఅరబిందో మార్గ్ న్యూఢిల్లీలో నిర్వహించే జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొంటాయని పేర్కొన్నారు.