Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టిప్స్ నేతలతో నవీన్ మిట్టల్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఇంటర్మీడియెట్ వార్షిక పరీక్షల నిర్వహణలో పారదర్శకత తీసుకొస్తామని ఇంటర్ బోర్డు కార్యదర్శి నవీన్ మిట్టల్ చెప్పారు. ఆర్జేడీ కార్యాలయాన్ని హైదరాబాద్కు తేవడం, ఇంటర్ బోర్డులో ఈ ఆఫీస్ ప్రవేశపెట్టినందుకు ఆయనను శుక్రవారం హైదరాబాద్లో తెలంగాణ ఇంటర్ విద్యా పరిరక్షణ సమితి (టిప్స్) కన్వీనర్ మాచర్ల రామకృష్ణగౌడ్, సమన్వయకర్త మైలారం జంగయ్య నేతృత్వంలో కలిసి కృతజ్ఞతలు తెలిపారు. పరీక్షల విధులను సీనియార్టీ ప్రకారమే కేటాయిస్తామని ఆయన హామీ ఇచ్చారని పేర్కొన్నారు. 317 జీవో అమల్లో జరిగిన అన్యాయాలను సరిచేస్తామనీ, ఉద్యోగులకు రావాల్సిన అన్ని రకాల ప్రయోజనాలను త్వరలో అందేలా చూస్తామన్నారని వివరించారు. త్వరలోనే వివిధ స్థాయి అధికారుల అధికారాలను వికేంద్రీకరిస్తామన్నారని తెలిపారు. ఇంటర్ విద్యావ్యవస్థలో ఎలాంటి అవకతవకలు జరిగినా తన దృష్టికి తేవాలనీ, వాటిని పరిశీలించి సరి చేస్తామన్నారని పేర్కొన్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడానికి బాధ్యతతో పనిచేయాలని ఆదేశించారని తెలిపారు. టిప్స్ రాష్ట్ర కో కన్వీనర్లు లక్ష్మయ్య, రవీందర్ రెడ్డి, వస్కుల శ్రీనివాస్, శ్రీనివాస్ రెడ్డి, కెపి శోభన్ బాబు, మనోహర్, మృత్యుంజయ, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.