Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నలుగురు మృతి, కారు వెలికితీతకు చర్యలు
నవతెలంగాణ- కేసముద్రం రూరల్
ప్రమాదవశాత్తు కారు అదుపుతప్పి బావిలో పడి నలుగురు మృతి చెందిన సంఘటన మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలంలో శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి గ్రామానికి చెందిన ఐదుగురు తల్లీ కొడుకులు లలిత(55), నరేష్(20), కారు డ్రైవర్ బిక్కు, బాబు దీక్షిత్, సుమ కలిసి వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం అన్నారం షరీఫ్ దర్గాకు కారులో వెళ్లారు. దర్గాను దర్శించుకొని తిరిగి వస్తుండగా మహబూబాబాద్ జిల్లా సురేష్నగర్కు చెందిన దంపతులు గుగులోతు భద్రు(50), అచ్చాలి(40) ఇద్దరు లిఫ్ట్ అడగగా వారిని ఎక్కించుకుని మొత్తం ఏడుగురు వస్తున్నారు. కారు అధిక వేగంతో నడపడం, రోడ్ మార్గం తెలియక పోవడంతో మండలంలోని కేసముద్రం స్టేషన్ బైపాస్ రోడ్డు వద్ద కారు అదుపుతప్పి రహదారికి అనుకొని ఉన్న వ్యవసాయ బావిలో పడింది. కారులో ప్రయాణిస్తున్న వారిలో నలుగురు లలిత, నరేష్, భద్రు, అచ్చాలి అక్కడికక్కడే మృతిచెందారు. కారులో ఉన్న డ్రైవర్ బిక్కు, దీక్షిత్, సుమ క్షేమంగా బయటపడ్డారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరించి మృతదేహాలను మహబూబాబాద్ ఏరియా ఆస్పత్రికి తరలించినట్టు ఎస్ఐ రమేష్ బాబు తెలిపారు.