Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీఆర్ఎస్కు ఓటేయండి : తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం పిలుపు
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
మునుగోడు ఉప ఎన్నికల్లో సీపీఐ(ఎం), సీపీఐ బలపర్చిన టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం కూలీలకు, ఉపాధి హామీ కూలీలకు విజ్ఞప్తి చేసింది. బీజేపీ అభ్యర్థిని ఓడించాలని పిలుపునిచ్చింది. ఈమేరకు శుక్రవారం ఆ సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జి నాగయ్య, ఆర్ వెంకట్రాములు కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వెంకట్రాములు మాట్లాడుతూ మునుగోడులో గ్రామీణ ప్రాంత పేదలు ఐక్యమై బీజేపీని ఓడించాలనీ, టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఇప్పటికే ఎన్నో ప్రభుత్వ రంగ సంస్థలను ప్రయివేటుపరం చేసి ఉపాధిని దెబ్బతీసిందని పేర్కొన్నారు. దీంతోపాటు గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్వీర్యం చేస్తున్నదని విమర్శించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు బి ప్రసాద్, మహిళా కూలీల కన్వీనింగ్ కమిటీ కన్వీనర్ బొప్పని పద్మ, రాష్ట్ర కమిటీ సభ్యులు ఆర్ అంజనేయులు తదితరులు పాల్గొన్నారు.