Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి బెయిల్ రద్దు చేయాలని నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు వేసిన రిట్‌ను కొట్టేస్తూ శుక్రవారం హైకోర్టు తీర్పు చెప్పింది. బెయిల్ నిబంధనలను ఉల్లంఘించారని పిటిషనర్ చెప్పలేకపోయారనీ, బెయిల్ నిబంధనలను జగన్ ఉల్లంఘించలేదని సీబీఐ వాదనను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ సమర్ధిస్తూ తీర్పు చెప్పారు. బెయిల్ షరతులను ఉల్లంఘిస్తేనే బెయిల్ రద్దు చేయాలని సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఇచ్చిందని గుర్తు చేశారు. రాజు పిటిషన్‌ను కొట్టివేశారు.
రాజాసింగ్ కేసు...31కి వాయిదా
ఎమ్మెల్యే రాజాసింగ్‌పై నమోదైన పీడీ యాక్ట్ కేసులో వాదనలను హైకోర్టు ఈనెల 31వ తేదీకి వాయిదా వేస్తూ జస్టిస్ అభిషేక్‌రెడ్డి, జస్టిస్ జువ్వాడి శ్రీదేవి ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. పీడీ యాక్ట్‌ను కొట్టేయాలని రాజాసింగ్ భార్య ఉషాభారు వేసిన రిట్‌ను శుక్రవారం హైకోర్టు విచారణ జరిపింది. పీడీ యాక్ట్ కింద 12 మాసాలపాటు జైల్లో పెట్టొచ్చుననీ, ఇందుకు వీలుగా ప్రభుత్వం జీవో తెచ్చిందని ప్రభుత్వ న్యాయవాది చెప్పారు. జీవోను సవాల్ చేస్తామని ఆమె న్యాయవాది చెప్పడంతో విచారణ 31వ తేదీ సోమవారానికి వాయిదా పడింది.