Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల ప్రకారం సీనియార్టీని సవరించి పదోన్నతుల కోసం ఉత్తర్వులను వెంటనే ఇవ్వాలని తెలంగాణ గెజిటెడ్ అధికారుల (టీజీవో) సంఘం డిమాండ్ చేసింది. టీజీవో అధ్యక్షులు వి మమత, ప్రధాన కార్యదర్శి ఎ సత్య నారాయణ, హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు ఎంబీ కృష్ణ యాదవ్, నగర శాఖ అధ్యక్షులు జి వెంకటేశ్వర్లు, నాయకులు బి వెంకటయ్యను శుక్రవారం హైదరాబాద్‌లో తెలంగాణ డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్లు (టీడీఏవో) సంఘం నాయకులు కలిసి ప్రభుత్వం నుంచి సరైన ఉత్తర్వులు సకాలంలో ఇప్పించినందుకు హర్షం వ్యక్తం చేశారు. ఈనెల 22న సభ్యుల సీనియార్టీ, పదోన్నతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసిందని తెలిపారు. తక్షణమే తగు చర్యలు తీసుకుని సీనియార్టీని సవరించి పదోన్నతులు ఇచ్చేందుకు వీలుగా తెలంగాణ డైరెక్టర్ ఆఫ్ అకౌంట్స్‌తో మాట్లాడాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీడీఏవో కార్యదర్శి పి రాధారమణరెడ్డి, కోశాధికారి ఎండీ హసామ్ తదితరులు పాల్గొన్నారు.