Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎకరాలకెకరాలు కబ్జా
- జీఓ నెం.59 కింద రెగ్యులరైజేషన్‌కు దరఖాస్తులు
- రూ.50వేల కోట్ల విలువైన స్థలాలు
- పట్టించుకోని సర్కార్
- గ్రేటర్లో ఇదీ పరిస్థితి
- భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి : సీపీఐ(ఎం) నగర కార్యదర్శి ఎం.శ్రీనివాస్
పేదలకు ఒక న్యాయం.. పెద్దలకు మరో న్యాయం. పేదోడు గూడు కోసం జానెడు జాగాలో గుడెసేసుకుంటే పీకిపారేస్తున్న రెవెన్యూ అధికారులకు కోట్లాది రూపాయల విలువైన భూముల్లో పెద్దలు పాగా వేస్తే కనిపించడం లేదు. పేదలు అవసరం కోసం ఆక్రమిస్తే అరెస్టులు చేస్తరు.. పెద్దలు వ్యాపారం కోసం ఆక్రమిస్తే పట్టించుకునే నాథుడే కరువు. ఇప్పుడు వారికి జీవో నెం.58, 59 ఓ వరంలా మారాయి. జీవో నెం.59 కింద ఎంత స్థలం వరకు అనే పరిధి విధించకపోవడంతో ఎకరాల కొద్దీ భూమిని క్రమబద్ధీకరించాలంటూ వేలల్లో దరఖాస్తులు పెట్టుకున్నారు. ఇదీ రాష్ట్ర రాజధాని గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో హైదరాబాద్, మేడ్చల్-మల్కాజ్గిరి, రంగారెడ్డి జిల్లాల్లోని యూఎల్సీ భూముల కబ్జా పరిస్థితి.
నవతెలంగాణ- సిటీబ్యూరో
గ్రేటర్‌లోని హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల్లో కోట్లాది రూపాయల విలువైన యూఎల్సీ (పట్టణ ప్రాంతంలో సీలింగ్ భూములు) భూములను దక్కించుకోవడానికి కొందరు దరఖాస్తులు చేసుకున్నారు. రంగారెడ్డి జిల్లాలో 607ఎకరాల యూఎల్సీ భూములను రెగ్యులరైజ్ చేయాలని జీఓ నెం.59 కింద 11,744 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీటిలో మల్కాజ్గిరి రెవెన్యూ డివిజన్లో అత్యధికంగా 7,243 దరఖాస్తులు వచ్చాయి. హైదరాబాద్ జిల్లాలో 4,843 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీటిలో హైదరాబాద్ రెవెన్యూ డివిజన్ పరిధిలో 707, సికింద్రాబాద్ డివిజన్లో 4,136 ఉన్నాయి.
రూ.50 వేల కోట్లపైనే..
గ్రేటర్‌లోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజ్గిరి జిల్లాల పరిధిలో రూ.50 వేల కోట్ల విలువైన భూములను కాజేయడానికి పెద్దలు పథకం వేశారు. ఈ భూములను తమకు రెగ్యులరైజ్ చేయాలని ఏకంగా దరఖాస్తులే చేసుకున్నారు. జీఓ నెం.58 కింద 125 గజాల వరకు ఉచితంగా క్రమబద్ధీకరించాలని, ఆపై స్థలానికి జీఓ నెం.59 కింద రిజిస్ట్రేషన్ విలువలో 50 శాతం చెల్లిస్తే క్రబద్ధీకరించాలని సర్కార్ నిర్ణయించిన విషయం తెలిసిందే. అయితే, 250 గజాలపైన అన్నారు తప్ప పరిధి అంటూ నిర్ణయించలేదు. ఇదే అదనుగా భావించిన కబ్జాదారులు ఏకంగా ఎకరాల భూమిని సైతం క్రమబద్ధీకరించాలని దరఖాస్తులు పెట్టుకున్నారంటే
పైరవీలు, ఏ స్థాయిలో డబ్బులు చేతులు మారుతాయో చెప్పనక్కర్లేదు.
బండ్లగూడ కల్సాలో అహ్మద్ మెమోరియల్ ఎడ్యూకేషన్ సొసైటీ(ఖాజాహసన్) 42.30 ఎకరాలు ఆక్రమించింది. ముఖ్యంగా శేరిలింగంపల్లి మండలం గుట్టల బేగంపేట్‌లో గజం స్థలానికి కోట్లలో విలువ ఉంటుంది. ఆ ఏరియాలో ఒక్కొక్కరు 1000 గజాలపైనే ఆక్రమించారు. కొండాపూర్‌లో ఎం.రాజుయాదవ్ అనే వ్యక్తి ఏకంగా 3 ఎకరాలు(12000గజాలు), మియాపూర్‌లోని సర్వే నెం.99లో శాకమూరి సుగుణ 8.4 ఎకరాలు, మేరీ యరువ అనే వ్యక్తి శేరిలింగంపల్లి సర్వే నెం.106,107లో 13.31ఎకరాలు, శంషాబాద్ మండలంలోని కొత్వాల్గుడలో ఎస్వీ లక్ష్మిదేవి ఎకరం యూఎల్సీ స్థలాన్ని ఆక్రమించి రెగ్యులరైజేషన్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. వాటిలో ముఖ్యమైనవి ఇలా ఉన్నాయి.
బాలాపూర్ మండలం
బద్దం భూపాల్‌రెడ్డి 4.84ఎకరాలు
ఎం.అమరనాథ్‌రెడ్డి ఎకరం
ఎం.సత్తయ్య ఎకరం
మేకల శ్రీశైలం ఎకరం
ఎ.కృష్ణారెడ్డి ఎకరం
సముద్రాల రాజు ఎకరం
పోలేపల్లి మదన్‌మోహన్‌రెడ్డి ఎకరం
పొలసాని శ్రీకాంత్‌రావు ఎకరం
పొలసాని శ్రీనివాస్‌రావు ఎకరం
పి.సుభ్రమణ్యంరెడ్డి 3.63ఎకరాలు
షాహేద ఎకరం
ఎ.వసంత ఎకరం
తోటకూర ఫణిమోహన్ 1.8 ఎకరాలు
అబ్బిడిసమ్మిరెడ్డి, అనుశ్రీ ఎకరం
కొత్తపేట గ్రామంలో
ఎం.మహేందర్ 2.5ఎకరాలు
జల్పల్లి గ్రామంలో
యూసుఫ్ అబ్దుల్ ఖాదర్ అండ్ అదర్స్ 2.42ఎకరాలు
జి.వీరాస్వామి అండ్ అదర్స్ 1.24 ఎకరాలు
రేణుకాపూర్ గ్రామంలో
మేకల బాలయ్య 2.5ఎకరాలు
మేకల మాణిక్యం 2.5ఎకరాలు
మేకల శ్రీశైలం 2.5ఎకరాలు
మేకల శ్రీనివాస్ 2.5ఎకరాలు
మేకల మల్లేష్ 2.5ఎకరాలు
మేకల బాలయ్య 4.3ఎకరాలు
సికింద్రాబాద్ మండలం
భోలక్‌పూర్‌లో గోనే దయాకర్ ఎకరం
సరూర్‌నగర్ మండలం
రమేష్కుమార్మిట్టల్(జల్పల్లి) 2.42ఎకరాలు
ఇబ్రాహీం మండలం
డి.రంగాప్రసాద్(మంగలపల్లి) 3.3ఎకరాలు
వి.రాముగౌడ్(మంగలపల్లి) 2803గజాలు
హయత్‌నగర్ మండలం
బొపన్న శారదదేవి(తొర్రూర్) ఎకరం
బొపన్న శారదదేవి(తుర్కయంజాల్) ఎకరం
మానేపల్లి శ్రీలత(తుర్కయంజాల్) ఎకరం
మానేపల్లి మమత(తుర్కయంజాల్) ఎకరం
ఉమ్మా నర్సింహ్మారెడ్డి(తుర్కయంజాల్) 2.42ఎకరాలు
యర్ర మాసయ్య(హయత్‌నగర్) 1.5ఎకరాలు
యూఎల్సీ భూములను స్వాధీనం చేసుకోవాలి
ఎం.శ్రీనివాస్, సీపీఐ(ఎం) నగర కార్యదర్శి
గ్రేటర్‌లోని ఆక్రమణకు గురైన యూఎల్సీ భూములు (పెద్ద కమతాలను) ప్రభుత్వ స్వాధీనం చేసుకోవాలి. ఆ భూములను ప్రజాప్రయోజనాలకు వినియోగించాలి. స్కూళ్లు, కాలేజీలు, మార్కెట్లు, క్రీడామైదానాలు వంటి వాటిని నిర్మించాలి. పేద, మధ్యతరగతి ప్రజలు ఎవరైనా యూఎల్సీ భూములను రెగ్యులరైజ్ చేయాలని దరఖాస్తు చేసుకుంటే చేయాలి.