Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్
నవతెలంగాణ-కాశిబుగ్గ
వరంగల్ ఆయుర్వేదిక్ మెడికల్ కళాశాలలో మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేస్తూ శనివారం విద్యార్థులు ఆందోళన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం కళాశాలలో మౌలిక వసతులు కల్పించకపోవడంతో మొదటి సంవత్సరం అడ్మిషన్లు రద్దు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయుర్వేదిక్ విద్య అభివృద్ధికి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. జిల్లాకో మెడికల్ కాలేజ్ తెస్తామని చెబుతున్న రాష్ట్ర ప్రభుత్వం ఆయుర్వేద విద్యపై ఎందుకు నిర్లక్ష్యం చూపుతోందని ప్రశ్నించారు. కళాశాలలో 300 మంది విద్యార్థులకు ఒకటే వాష్రూమ్ ఉందని, మౌలిక వసతులు లేవని, ఫ్యాకల్టీ కొరత ఉందని తెలిపారు. అడ్మిషన్లు నిలిపివేయడం వల్ల కళాశాల స్థలాన్ని స్వాధీనం చేసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం కుట్ర చేస్తుందని ఆరోపించారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కళాశాలలో మౌలిక వసతులు కల్పించి తగినంత సిబ్బందిని నియమించి ఆయుర్వేద విద్యను కాపాడాలని కోరారు.