Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మెండోరా
సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు కేంద్ర జలవనరుల సంఘం ఆధ్వర్యంలో సీడబ్ల్యూసీ, మహారాష్ట్ర అధికారుల సమక్షంలో శనివారం బాబ్లీ గేట్లు మూసేసినట్టు శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఈఈ చక్రపాణి తెలిపారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు జులై ఒకటో తేదీన బాబ్లీ ప్రాజెక్టు 14 గేట్లు ఎత్తగా.. నిర్ణీత సమయం ముగియడంతో శనివారం ఉదయం మహారాష్ట్ర, తెలంగాణ జలవనరుల సంఘం అధికారుల సమక్షంలో గేట్లను మూసివేశామని చెప్పారు. మూగజీవాల తాగునీటి అవసరాల నిమిత్తం మళ్లీ మార్చి నెలలో బాబ్లీ గేట్లను ఎత్తే అవకాశం ఉందన్నారు. ఆ తర్వాత సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు వచ్చే ఏడాది జులై ఒకటో తేదీన గేట్లు తెరవనున్నట్టు ప్రాజెక్టు అధికారులు చెప్పారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు అధికారులతోపాటు సీడబ్ల్యూసీ ఈఈ శ్రీనివాస్, మహారాష్ట్ర బాబ్లీ ప్రాజెక్టు డీఈఈ పి.రవీంద్ర, శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఈఈ చక్రపాణి, డీఈఈ రఘుపతి, ఏఈఈ రవి, ఏఈఈ వంశీ పాల్గొన్నారు.