Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
సులభతర శైలిని మెరుగుపరుచుకోవాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సూచించారు. శనివారం హైదరాబాద్లో వాణిజ్య మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న ఎఫ్డీఐఐ, ఎన్ఐడి, నిఫ్ట్, ఐఐఎఫ్టి, ఐఐపి విద్యా సంస్థల విద్యార్థుల సమావేశం నిర్వహించారు. 'డిజిటలైజేషన్, ఇన్నోవేషన్, ఎంటర్ప్రిన్యూర్షిప్: భారత ఆర్థిక వ్యవస్థకు మూలస్తంభాలు' అనే అంశంపై ఆమె మాట్లాడారు. ఇప్పటికే భారతదేశం అభివృద్ధి చేసిన స్థిరమైన డిజైన్ల గురించి తెలుసుకోవాలనీ ,వాటిని ప్రస్తుత తరం ప్రజల జీవన సౌలభ్యం కోసం వాటిని మరింత మెరుగుపరచాలని సలహా ఇచ్చారు. తోలు, ఆభరణాల రంగంలో స్వదేశంలో అభివృద్ధి చేసిన వివిధ డిజైన్లను ఆమె విద్యార్థులకు ఉదాహరణగా వివరించారు. 'విద్యార్థులు మార్పును స్వీకరించాలన్నారు. కేంద్ర పరిశ్రమ, వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ, జౌళి శాఖ మంత్రి పీయూష్ గోయల్ మాట్లాడుతూ భారతదేశ ఆర్థిక వ్యవస్థ ప్రపంచానికి ఒక ఆశా కిరణంగా ఉందని తెలిపారు. కోవిడ్ సమయంలో దేశంలో విజయవంతం అయిన పీపీఈ కిట్లు, పరీక్ష కోసం ఉపయోగించే స్వాబ్ లాంటి వివిధ ఆవిష్కరణలను వివరించారు. పేటెంట్లు పొందడానికి ఆన్లైన్ వ్యవస్థను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. దీనివల్ల అంకుర సంస్థలు, పేటెంట్లు పొందేందుకు కృషి చేస్తున్న వారికి ప్రయోజనం కలుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్, ఫుట్వేర్ డిజైన్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్యాకేజింగ్ అధిపతులు, వాణిజ్య మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి రాజీవ్ సింగ్ ఠాకూర్, ఎఫ్డిడిఐ ఎండీ అరుణ్ కుమార్ సిన్హా, నిఫ్ట్ డైరెక్టర్ విజరు కుమార్ మంత్రి, ఎన్ఐడికి చెందిన ప్రొఫెసర్ శేఖర్ ముఖర్జీ, ఎఫ్డిఐఐ హైదరాబాద్ సెంటర్ ఇంచార్జ్ దీపక్ చౌదరి, ఐఐఎఫ్టి డీన్ డాక్టర్ సతీందర్ భాటియా, ఐఐపీ చైర్మెన్ వాగీ దీక్షిత్ ఇతర సీనియర్ అధికారులు పాల్గొన్నారు.