Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హాజరు కానున్న సీఎం కేసీఆర్
నవతెలంగాణ- నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి
మునుగోడు ఉప ఎన్నికల అంకం చివరి దశకు చేరింది. మరో రెండ్రోజుల్లో ప్రచారం కూడా ముగియనుంది. క్రమంలో టీఆర్ఎస్ భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు చేసింది. 30న నియోజకవర్గంలోని చండూరు మండలం బంగారిగడ్డ వద్ద సభ నిర్వహణకు నేతలు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ సభకు సీఎం కేసీఆర్ హాజరవుతున్నారు. దాదాపు నెల రోజులుగా ఇక్కడ ప్రచారంలో పాల్గొన్న నేతలు, మంత్రులు, ఎమ్మెల్యే అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి సభలో పాల్గొంటారు. దాదాపు 3గంటలకు సీఎం కేసీఆర్ సభలో పాల్గొంటారు. సభకు హాజరయ్యే జనం వాహనాల పార్కింగ్ కోసం మండలాల వారీగా ఏర్పాటు చేశారు. సుమారు లక్ష మందిని ఈ సభకు తరలించేందుకు నేతలు కృషిచేస్తున్నారు. మునుగోడు ఎమ్మెల్యేగా కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి రాజీనామా చేసిన కొత్తలో మునుగోడులో ప్రజా దీవెన పేరుతో సభ నిర్వహించారు. ఆ సభలోనే మరోసారి చండూరులో సభ నిర్వహించుకుందామని హామీ ఇచ్చారు. ఆమేరకు ఇప్పుడు సభ ఏర్పాటు చేశారు. ఇప్పటివరకు విజయం ఖాయంగానే భావిస్తున్న టీఆర్ఎస్ పార్టీకి ఈ సభతో మరింత ఊపునిచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ సందర్బంగా చండూరులో విలేకరుల సమావేశంలో ఉమ్మడి జిల్లా పార్టీ ఇన్చార్జీ, ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావు మాట్లాడారు. సీఎం సభ నిర్వహణ అనగానే నియోజకవర్గ ప్రజల్లో ఎనలేని ఉత్సహం పెరిగిందన్నారు. ఈ సభలో బీజేపీ బండారం బయటపెట్టనున్నారని, సబ్బండ వర్గాలు టీఆర్ఎస్తోనే ఉన్నాయని తెలిపారు.