Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్ర సర్కారు తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి : లక్ష్మణ్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో చేనేతపై ఐదు శాతం పన్ను విధించేందుకు అంగీకరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం సంతకాలు చేసిందనీ, నిజంగా చేనేత కార్మికులపై చిత్తశుద్ధి ఉంటే ఐదు శాతంలో 2.5 శాతాన్ని కేసీఆర్ వదులుకోవాలని సూచిం చారు. శనివారం హైదరాబాద్లో ఆయన మీడియాతో మాట్లాడారు. అన్ని రాష్ట్రాల ఆర్థిక మంత్రుల ఏకగ్రీవంతోనే చేనేత వస్త్రాలపై కౌన్సిల్ జీఎస్టీ విధించిందని గుర్తుచేశారు. ఈ విషయాన్ని మరుగున పరిచి రాజకీయ లబ్ధి కోసం కేంద్ర ప్రభుత్వంపై టీఆర్ఎస్ లేనిపోని ఆరోపణలు చేస్తున్నదని విమర్శించారు. చేనేత కార్మికులపై రూ.40 లక్షల వరకు కేంద్రం జీఎస్టీకి మినహాయింపు ఇచ్చిందనీ, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం రూ.20 లక్షలకే జీఎస్టీ ఎందుకు విధిస్తోందో సమాధానం చెప్పాలని అడిగారు. రూ.40 లక్షలకు పెంచితే మగ్గాలు నేసే కార్మికులపై భారం తగ్గుతుందని సూచించారు. రాష్ట్ర సర్కార్ చేనేత కార్మిక సంఘాలకు ఎన్నికలు ఎందుకు నిర్వహించడం లేదని ప్రశ్నించారు. టెస్కో కు చైర్మెన్, డైరెక్టర్ లేకుండా అంతా ముఖ్యమంత్రి కేసీఆరే పెత్తనం చెలాయిస్తున్నారని విమర్శించారు. గతంలో ఆప్కో ద్వారా నామ మాత్రపు వడ్డీతో నేత కార్మికులకు రుణాలు లభించేవనీ, నేడు విధిలేని పరిస్థితుల్లో బ్యాంకుల ద్వారా అధిక శాతం వడ్డీకి నేతన్నలు రుణం తీసుకుంటున్నారని తెలిపారు.