Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
విదేశాల్లో చదువుకోవాలనే ఆసక్తి ఉన్న బ్రాహ్మణ విద్యార్థులు వివేకానంద విదేశీ విద్యా పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి గడువును నవంబర్ 15వ తేదీ వరకు పొడిగిస్తున్నట్టు తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్తు పాలనాధికారి యు రఘురాంశర్మ తెలిపారు. ఈ మేరకు శనివారంనాడొక పత్రికా ప్రకటన విడుదల చేశారు. గతంలోనే ఈ పథకం కింద విద్యా ర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వా నించారు. ఆ గడువు అక్టోబర్ 31తో ముగిసింది. ఈ నేపథ్యంలో మరోసారి విద్యార్థులకు అవకాశం కల్పిస్తూ గడువు తేదీని పొడిగించామని వివరించారు. బ్రాహ్మణ విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసు కోవాలని విజ్ఞప్తి చేశారు.