Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో వివిధ శాఖల పరిధిలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు (ఏఈఈ)కి సంబంధించి 1,540 పోస్టుల భర్తీకి జనవరి 22న రాతపరీక్షను నిర్వహించనున్నట్టు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) ప్రకటించింది. ఈ మేరకు టీఎస్పీఎస్సీ కార్యదర్శి అనితా రామచంద్రన్ శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. రాతపరీక్ష నిర్వహణకు వారం రోజుల ముందునుంచి హాల్టికెట్లను ఏఈఈ పోస్టులకు దరఖాస్తు చేసిన అభ్యర్థులు టీఎస్పీఎస్సీ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. ఇతర వివరాలకు www.tspsc.gov.in వెబ్సైట్ను సంప్రదించాలని సూచించారు. అయితే మిషన్ భగీరథ విభాగంలో 302, పీఆర్ అండ్ ఆర్డీ (సివిల్) విభాగంలో 211, ఎమ్ఏ అండ్ యూడీలో 147, టీడబ్ల్యూలో 15, ఐ అండ్ క్యాడ్లో 704, సివిల్ ఇంజినీరింగ్లో 320, మెకానికల్లో 84, ఎలక్ట్రికల్లో 200, అగ్రికల్చర్లో 100, ఐ అండ్ క్యాడ్ జీడబ్ల్యూలో 3, టీ ఆర్ అండ్ బీ విభాగం (సివిల్)లో 145, టీ ఆర్ అండ్ బీ విభాగం (ఎలక్ట్రికల్)లో 13 పోస్టులు కలిపి ఏఈఈకి సంబంధించి మొత్తం 1,540 పోస్టులను టీఎస్పీఎస్సీ భర్తీ చేస్తున్న విషయం తెలిసిందే.