Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
క్రికెటర్, టీం ఇండియా మాజీ కెప్టెన్ మహ్మద్ అజారుద్దీన్‌ను ఆర్థిక, ఆరోగ్య శాఖల మంత్రి టీ హరీశ్‌రావు పరామర్శించారు. అజారుద్దీన్ తండ్రి మహమ్మద్ అజీజుద్దీన్ ఇటీవల మతి చెందిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా మంత్రి శనివారం అజారుద్దీన్ ఇంటికి వెళ్లి పరామర్శించి, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.