Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీ నేతలు విచ్చల విడిగా డబ్బు పంపిణీ చేస్తున్నారని టీఆర్ఎస్ ఎంపీలు బడుగుల లింగయ్య యాదy,్ పి.రాములు, వెంకటేష్ నేత ఆందోళన వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీలు బండ ప్రకాష్, వి. గంగాధర్ గౌడ్, మాజీ ఎమ్మెల్సీ ఎం. శ్రీనివాస్ రెడ్డి, పోలీస్ హౌజింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్‌తో కలిసి ఆదివారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మునుగోడులో ఓటర్లను డబ్బుతో ప్రలోభాలకు గురిచేస్తున్నదని ఆరోపించారు. బీజేపీ అరాచకాలపై ఈసీకి అనేక సార్లు ఫిర్యాదు చేశామని తెలిపారు. వృద్ధులు, చదువురాని వారి చేతులపై పువ్వు గుర్తును అచ్చు వేస్తున్నారనీ, ఇది ఎన్నికల నియమావళికి విరుద్దమన్నారు. మరి కొన్ని చోట్ల దౌర్జన్యాలకు పాల్పడు తున్నదనీ, ఈ పద్దతిని మార్చుకోవాలని హెచ్చరించారు. రాజగోపాల్‌రెడ్డి కంపెనీ నుంచి డబ్బు బదిలీ చేసిన అకౌంట్‌ను సీజ్ చేయాలని డిమాండ్ చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజరు వ్యవహార శైలి చూసి అందరూ నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. అమిత్‌షా చెప్పులు మోసిన చేతులతో బండి సంజరు యాదాద్రీశుణ్ణి తాకాడం బాధగా ఉందన్నారు. మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డిదే గెలుపని ధీమా వ్యక్తం చేశారు. రూ.18 వేల కోట్లకు బీజేపీకి అమ్ముడుపోయిన ఒక స్వార్థపరుడి కోసం ఈ ఎన్నిక వచ్చిందని తెలిపారు. వందల కోట్లు ఆశ చూపి టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనాలనీ, ప్రభుత్వాన్ని పడగొట్టాలని కుట్ర పన్నారని విమర్శించారు. ఈ విషయంపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసామని తెలిపారు.