Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నవంబర్ 5,6,7 తేదీల్లో...జంతర్ మంతర్ వద్ద ధర్నా : సీఐటీయూ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్లను వ్యతిరేకిస్తూ టీయూసీఐ ఆధ్వర్యంలో నవంబర్ 5,6,7 తేదీల్లో న్యూఢిల్లీ జంతర్ మంతర్ వద్ద జరిగే ధర్నాను విజయవంతం చేయాలని తెలంగాణ స్టేట్ గని కార్మిక సంఘం (టీఎస్ జీకేఎస్-టీయూసీఐ అనుబంధ సంఘం) గౌరవాధ్యక్షులు గడ్డం సదానందం పిలుపునిచ్చారు. కార్మికుల జీవితం దుర్భరంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రయివేటీకరిస్తూ అందులో పని చేసే ఉద్యోగులకు నష్టం చేస్తున్నారని తెలిపారు.