Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రారంభించిన యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
హైదరాబాద్ : యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 104వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు పురస్కరించుకొని బ్యాంకు ఉద్యోగుల కోసం యోగా సెషన్స్ ప్రారంభమయ్యాయి. భారత్‌లోని అన్ని కేంద్రాల్లో ప్రతివారమూ ఈ తరగతులుంటాయి. హైదరాబాద్ కేంద్రంలోనూ ఇది ప్రారంభమైంది. ఎల్బీ స్టేడియంలో ఉదయం 7.30 కార్యక్రమం ప్రారంభమైంది. తెలంగాణ హైదరాబాద్ జోన్ ఫీల్డ్ జనరల్ మేనేజర్ సరేశ్ చంద్ర టేలి ఈ కార్యక్రమాన్ని హౌస్ట్ చేశారు. యోగా ప్రాముఖ్యతను తెలిపారు. ప్రతిరోజూ యోగాను ప్రతి ఒక్కరూ సాధన చేయాలన్నారు. లోకల్ రీజినల్ హెడ్స్ సైఫాబాద్ శ్రీధర్ బాబు, పంజాగుట్ట దుండీశ్వర్ రావు ఇందులో పాల్గొన్నారు. ఇతర ఎగ్జిక్యుటీవ్లు, స్టాఫ్ సభ్యులు బ్యాంకు రిటైర్డ్ చీఫ్ మేనేజర్ కరణమ్ అజిత్ నిర్వహించిన యోగా సెషన్స్‌కు హాజరయ్యారు. డిప్యూటీ జోనల్ హెడ్ కోటా అజరు పాల్ ధన్యవాదాలు తెలిపారు.