Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విచారణ చేయాలంటే రాష్ట్ర ప్రభుత్వ అనుమతి తప్పనిసరి
- ఉత్తర్వులు ఇచ్చిన ప్రభుత్వం
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
రాజకీయ కక్షలు తీర్చుకొనేందుకు పావుగా ఉపయోగపడుతున్న సీబీఐకి రాష్ట్ర ప్రభుత్వం ముక్కుతాడు వేసింది. ఇకపై ఏ కేసులోనైనా సీబీఐ తన ఇష్టం వచ్చినట్టు కేసులు పెట్టి, విచారణలు చేపట్టడానికి వీలులేకుండా, గతంలో ఇచ్చిన అనుమతులన్నింటినీ రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది. ఈ మేరకు ఈ ఏడాది ఆగస్టు 30న జీవో నెంబర్ 51 జారీచేసింది. తాజాగా ఇప్పుడు దాన్ని అమల్లోకి తేవాలని భావిస్తున్నారు. అలాగే ఎమ్మెల్యేల కొనుగోళ్లు అంశంలో సీబీఐ విచారణ జరిపించాలని బీజేపీ హైకోర్టులో పిటీషన్ వేసిన విషయం తెలిసిందే. దానిపై తదుపరి విచారణ నవంబర్ 4వ తేదీ జరగనుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం సీబీఐ ప్రవేశానికి అనుమతులు రద్దు చేస్తూ ఇచ్చిన ఉత్తర్వులు చర్చనీయాంశంగా మారాయి. అలాగే కొద్ది కాలంగా బీజేపీ నేతలు టీఆర్ఎస్ నేతలపై సీబీఐ, ఈడీ దాడులు జరుగుతాయని ప్రచారం చేస్తున్న విషయం కూడా తెలిసిందే.