Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉప ఎన్నికల్లో గుణపాఠం చెప్పాలి : సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు
నవతెలంగాణ:దేశాన్ని కబళిస్తున్న బీజేపీకి మునుగోడు ఉప ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు పిలుపునిచ్చారు. ఆదివారం చండూరు మండలంలోని బంగారుగడ్డలో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ధరలు పెంచి సామాన్యుడి నడ్డి విరించిందన్నారు. తమ మద్దతుతో గెలిచిన రాజగోపాల్రెడ్డ్డి రూ.18వేల కోట్ల కాంట్రాక్టుల కోసం బీజేపీలో చేరి కమ్యూనిస్టులే అమ్ముడుపోయారంటూ విమర్శలు చేయడాన్ని ఖండించారు. రాజగోపాల్రెడ్డి నోరు అదుపులో పెట్టుకోవాలని సూచించారు. లేకుంటే కమ్యూనిస్టుల నుంచి ప్రతిఘటన తప్పదని హెచ్చరించారు. మతం పేరుతో ప్రజల మధ్య చిచ్చుపెట్టి ఓట్లు దండుకోవాలని చూస్తున్న భాజపా నాయకులను గ్రామాల్లో నిలదీయాలని పార్టీ మారిన వ్యక్తి సెక్షన్ 420తో సమానమని చెప్పారు. మత ఘర్షణలు చెలరేపి సమాజాన్ని నిట్టనిలువునా చీల్చేవారు దేశ భక్తులు ఎలా అవుతారని ప్రశ్నించారు.
ఈ సభలో ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, కంచనపల్లి రవీందర్రావు, రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్యేలు రవీందర్ కుమార్ నాయక్, కంచర్ల భూపాల్ రెడ్డి, చిరుమర్తి లింగయ్య, మైనంపూడి సైదిరెడ్డి, గొంగిడి సునీత, సీనియర్ నాయకులు మోతుపల్లి నర్సింలు, మాజీ ఎమ్మెల్సీ ప్రభాకర్, సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకటరెడ్డి, సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి, మల్లు లక్ష్మి, జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి, భువనగిరి జిల్లా కార్యదర్శి ఎండీ జహంగీర్్, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు తుమ్మల వీరారెడ్డి, నారి ఐలయ్య, సీపీఐ సహాయ కార్యదర్శి పల్లా వెంకట్ రెడ్డి, యాదగిరిరావు, జిల్లా కార్యదర్శి నెల్లికంటి సత్యం తదితరులు పాల్గొన్నారు.