Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మతతత్వ వ్యతిరేక ఉద్యమానికి కెేసీఆర్ నాయకత్వం అవసరం
- బీజేపీ పాలనలో దేశం వినాశనం : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం
నవతెలంగాణ- నల్లగొండ
ఉద్యమాల గడ్డ నల్గొండ జిల్లాలో కాషాయ జెండా ఎగరనివ్వబోమని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం స్పష్టం చేశారు. నల్లగొండ జిల్లా మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో టీఆర్ఎస్కు సీపీఐ(ఎం), సీపీఐ మద్దతు ఇచ్చిన సందర్భంగా ఆదివారం చండూరు మండలం బంగారిగడ్డలో జరిగిన ముఖ్యమంత్రి కేసీఆర్ బహిరంగ సభలో తమ్మినేని పాల్గొని మాట్లాడారు. బీజేపీని ఓడించడమే తమ లక్ష్యమన్నారు. అందుకే టీఆర్ఎస్కు మద్దతు ఇచ్చినట్టు చెప్పారు. మత ఘర్షణలు పెట్టి లాభపడేందుకు బీజేపీ కుటిల యత్నం చేస్తోందని విమర్శించారు. మైనార్టీలు ఈ దేశంలో ఉండొద్దంటూ.. ప్రజలను రెచ్చగొడుతూ బీజేపీ మత ఘర్షణలు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రాలకు ఉన్న అన్ని హక్కులను లాక్కుంటూ కేంద్రం నియంతృత్వ పాలన సాగిస్తోందన్నారు. సాయుధ పోరాటం చేసిన తెలంగాణ గడ్డపై బీజేపీ అడ్డుకోవడమే తమ ఎజెండా అన్నారు. మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలుపు కోసం పనిచేయాలని పిలుపునిచ్చారు.