Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వారిది విభజన సిద్ధాంతం... మాది కలిపే సిద్ధాంతం
- రాజ్యాంగ వ్యవస్థలను ప్రణాళిక బద్ధంగా ధ్వంసం చేస్తున్న మోడీ
- టీఆర్ఎస్తో పొత్తు ప్రసక్తే లేదు : రాహుల్
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
నియంతృత్వంగా వ్యవహరించడమే బీజేపీ, ఆర్ఎస్ఎస్ డీఎన్ఏ అని ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. ఆ పార్టీది విభజన సిద్ధాంత మైతే...తమది ప్రజల్ని కలిపే సిద్ధాంతమని చెప్పారు. ప్రధాని మోడీ అధికారంలోకి వచ్చాక ప్రణాళిక బద్ధం గా రాజ్యాంగ వ్యవస్థలను ధ్వంసం చేస్తున్నారని విమ ర్శించారు. న్యాయ, శాసన, కార్య నిర్వాహక వంటి వ్యవస్థల్లో ప్రభుత్వ జోక్యం పెరిగిపోయిందని ఆవే దన వ్యక్తం చేశారు. గుజరాత్ పెట్టు బడిదారులకు అనుకూల విధానాలతో చిరు వ్యాపారులపై తీవ్రమైన ప్రభావం పడుతున్నదని చెప్పారు. మోడీ క్రోని క్యాపి టలిజాన్ని పెంచిపోషిస్తున్నారని విమర్శించారు. శాంతి, ప్రేమ, సౌభ్రతృత్వం కాంగ్రెస్ సంస్క్కతి అ యితే, అశాంతి, మతఘర్షణలు, అసహనం బీజేపీ సంస్కృతి అని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో కొనసాగు తున్న భారత్‌జోడో యాత్రలో భాగంగా సోమవారం రంగారెడ్డి జిల్లా కొత్తూరు గ్రామంలో మీడియాతో రాహుల్ ఇష్టాగోష్టిగా మాట్లాడారు. దేశంలో బీజేపీ, రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీలు రెండు కూడా కేవలం కొంతమంది లబ్దికోసం పనిచేస్తున్నాయని విమర్శిం చారు. వారి స్వలాభాల కోసం దేశ ఆర్థిక వ్యవస్థనే ఫణంగా పెట్టిన ఘనత బీజేపీకి దక్కుతుందన్నారు. ప్రజల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టి లబ్దిపొందాలనే కుట్రలతో బీజేపీ ప్రభుత్వం ఆర్ఎస్ఎస్ విధానాలను అమలు చేస్తున్నదని విమర్శించారు. ప్రజల మధ్య చిచ్చుపెట్టే బీజేపీ -ఆర్ఎస్ఎస్ విధానాలకు వ్యతి రేకంగా చేపట్టిన యాత్రే భారత్ జోడో యాత్ర అని స్పష్టం చేశారు. దేశ ఐక్యతే కాంగ్రెస్ పార్టీ ప్రధాన లక్ష్యమనీ, అదే తమ అజెండా అని వివరించారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వారు తీసుకు వచ్చిన నోట్ల రద్దు, జీఎస్టీ వంటి ఆర్థరహిత విధానాల కారణంగా నేడు చిరు వ్యాపారులపై పెను భారం పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయి అనేక మంది ఉపాధి అవకాశాలు కోల్పోయారని గుర్తు చేశారు. నేడు చాలా మంది ఉన్నత విద్యను అభ్యసించిన వారు సైతం నేడు కూలీలుగా మారారని ఆవేదన వ్యక్తం చేశారు. దానికి కారణంగా అధికారంలో ఉన్న పాలకులు కాదా? అని ప్రశ్నించారు. అదే సమయంలో విద్యా వ్యవస్థను కూడా కుంటుపడే విధంగా నిర్ణయాలు తీసుకుని ఆరోగ్యాన్ని వ్యాపారంగా మార్చిన చరిత్ర బీజేపీ-టీఆర్‌ఎస్‌లకే దక్కుతుందని చెప్పారు. ప్రజాస్వామ్య దేశంలో ప్రధాన భూమిక పోషించాల్సిన మీడియా పై కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అంక్షలు విధిస్తూ వారిని కూడా తమ అధీనంలో ఉంచుకునే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఇలాంటి అంక్షలను పూర్తిగా ఎత్తివేసి అందరికీ స్వేచ్చయుత వాతావరణం కల్పిస్తామని భరోసా ఇచ్చారు.
చైనా, యూఎస్‌లోనూ పోటీ చేయవచ్చు బీఆర్ఎస్పై సెటైర్లు
ముఖ్యమంత్రి కేసీఆర్ స్థాపించిన బీఆర్ఎస్పై ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజాస్వామ్య దేశంలో ఎవ్వరికైనా జాతీయ పార్టీ స్థాపించే అవకాశం ఉందనీ, దానికి సంబంధిం చి తమకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. దాంతో కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి ఇబ్బంది ఉండబోదన్నారు. అదే సమయంలో జాతీయ స్థాయిలో కాకుంటే అంత ర్జాతీయ స్థాయిలో పార్టీని పెట్టి చైనా, యూఎస్ఏ వంటి దేశాల్లో కూడా కేసీఆర్‌కు పోటీ చేసే అవకాశం ఉందనీ, అలా చేసినా ఎలాంటి తప్పులేదంటూ ఎద్దేవా చేశారు. 'రాజకీయంగా కొంత మంది తమ పార్టీని పెద్దదిగా ఉహించుకోవచ్చు...అందులో భాగ ంగానే జాతీయస్థాయిలో రాజకీయాలు చేయాలని ఆలోచించవచ్చు' అని సూచించారు. టీఆర్ఎస్ పార్టీతో కాంగ్రెస్ ఎట్టి పరిస్థితిలో పొత్తు పెట్టుకునే అవకాశం లేదని స్పష్టం చేశారు. ముఖ్యంగా అవినీతి లో కూరుకుపోయి, పేదల భూములను లాక్కుంటున టీఆర్ఎస్ విధానాలు తమ పార్టీకి పూర్తిగా వ్యతిరేక మని వివరించారు. అలాంటి పార్టీతో కాంగ్రెస్ కలిసి ఎలా పనిచేస్తుందని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా ప్రజావ్యతిరేక విధానాలను అవలంభిస్తున్న దనీ, దీనిపై తమ పార్టీ పోరాటం కొనసాగిస్తామన్నా రు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ఒంటరిగానే పోటీ చేయాలని రాష్ట్ర నాయకత్వం భావిస్తున్న తరుణంలో వారి నిర్ణయాన్ని పార్టీ గౌరవిస్తుందని తెలిపారు. ఇటీ వల పార్టీ జాతీయ అధ్యక్షుడిని సైతం ప్రజా స్వామ్య బద్దంగా ఎన్నుకున్నామని గుర్తు చేవారు. అలాగే బీజేపీ, టీఆర్ఎస్ ఎందుకు తమ నాయకుని ఎన్ను కోవడం లేదని నిలదీశారు. ఇటీవల బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు ఎన్నికల సందర్భంగా తమ పార్టీ అభ్యర్థుల కోసం వందల కోట్ల రూపాయాలను ఖర్చు చేస్తున్నా యనీ, ఇదంతా వారికి ఎక్కడి నుండి వచ్చిందో, ఎవ్వరిచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. అక్రమం గా ప్రజల నుంచి కొల్లగొట్టిన అవినీతి సొమ్మునే తిరిగి ఎన్నికల సందర్భంగా ప్రజలకు పంచుతున్నా రని చెప్పారు.
పాదయాత్రతో చాలా విషయాలను తెలుకున్నా...
తాను చేపట్టిన భారత్ జోడో యాత్ర కారణం గా దేశవ్యాప్తంగా వివిధ వర్గాల ప్రజలను కలుసుకునే అవకాశం లభించిందని రాహుల్ చెప్పారు. వారు చాలా విషయాలను తనకు వివరించడం వల్ల వాటిని తెలుసుకునే అవకాశం కలుగుతున్నదని చెప్పారు. దేశవ్యాప్తంగా యాత్ర చేయాలనే నిర్ణయం చాలా రోజుల క్రితమే తీసుకున్నప్పటికీ కోవిడ్ కారణంగా చేయలేకపోయానని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి కన్యా కుమారి నుంచి కాశ్మీర్ వరకు యాత్రను నిర్వహిస్తు న్నామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీతో ప్రజలకు ఎప్పుడు సంబంధాలు తెగిపోలేదనీ, తెగిపోవని ధీమా వ్యక్తం చేశారు. అయితే పార్టీ కొన్ని చోట్ల కొంత బలహీనపడిందని చెప్పారు. ప్రస్తుతయాత్రతో మరోసారి కాంగ్రెస్ పుంజుకుంటుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. గుజరాత్లో కాంగ్రెస్ చాలా బలంగా వుందనీ, అక్కడ ఆప్‌తో తమ పార్టీని పోల్చడం విడ్డురంగా ఉందని చెప్పారు.