Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
ఆర్టీసీ ఉద్యోగుల వేతన సవరణకు అనుమతి ఇవ్వాలని నేషనల్ మజ్దూర్ యూనియన్ ఎన్నికల కమిషన్‌కు విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు ఆ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు పీ కమాల్‌రెడ్డి, కార్యనిర్వాహక అధ్యక్షులు ఎమ్ నరేందర్, అడిషనల్ సెక్రటరీ ఎమ్ సత్యం తదితరులు ఎన్నికల కమిషన్‌ను కలిసి వినతిపత్రం అందచేశారు. వేతన సవరణ, ఇతర బెనిఫిట్స్ ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి అనుమతి ఇవ్వాలని కోరారు. రాజకీయపార్టీలు కూడా ఎన్నికల కమిషన్‌పై ఒత్తిడి తెచ్చి ప్రభుత్వంతో ప్రకటన చేయించాలని విజ్ఞప్తి చేశారు.