Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నలుగురు దుర్మరణం
- గంటల వ్యవధిలోనే అదే చోట మరో ప్రమాదం
- ముగ్గురికి తీవ్ర గాయాలు
నవతెలంగాణ-గుడిహత్నూర్
ఆదిలాబాద్ జిల్లా గుడి హత్నూర్ మండలం సీతా గోంది సమీపంలో జాతీయ రహదారిపై ఆదివారం అర్ధ రాత్రి ఘోర ప్రమాదం జరి గింది. కంటైనర్ లారీని వెనుక నుంచి కారు ఢకొీట్టడంతో నలుగురు అక్కడికక్కడే మృతిచెందారు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన సయ్యద్ రఫాతుల్లా(56) పనిపై హైదరాబాద్ వెళ్లారు. తిరిగి ఆదిలాబాద్‌కు తిరిగి వస్తుండగా గుడిహత్నూర్ మండలం సీతాగోంది సమీపంలో కంటైనర్ లారీని వెనుక నుంచి కారు బలంగా ఢకొీట్టింది. కారు నుజ్జునుజ్జయి బోల్తా పడింది. దాంతో కారులో ఉన్న నలుగురు అక్కడికక్కడే చనిపోయారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతులు రఫాతుల్లా(56), డ్రైవర్ శంషొద్దీన్(50), శభియా హష్మీ(26), సయ్యద్ వజాహద్(17)గా గుర్తించారు. వారంతా ఆదిలాబాద్ వాసులే. రఫాతుల్లా పంచాయతీరాజ్ డీఈగా పని చేస్తున్నారు. గాయపడిన జుబీయా హస్మీ ఆదిలాబాద్‌లో రిమ్స్‌లో వైద్య విద్యను అభ్యసిస్తున్నారు.
అదే చోట మరో ప్రమాదం..
అర్ధరాత్రి సీతాగొంది జాతీయ రహదారిపై ప్రమాదం జరిగిన ప్రాంతంలోనే గంటల వ్యవధిలోనే మరో ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి నాగ్‌పూర్ వెళ్తున్న వాహనాలు అదుపు తప్పి ఒకదానికి ఒకటి వరుసగా మూడు కంటైనర్లు ఢకొీన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు డ్రైవర్లు తీవ్రంగా గాయపడ్డారు. జాతీయ రహదారి ములమలుపు వద్ద ప్రమాద సూచిక బోర్డులు లేకపోవడం, ఎత్తైన కొండ ప్రాంతం వద్దనే మూలమలుపు ఉండటం వల్లే తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. అయితే, జాతీయ రహదారి నిర్మాణంలోనే లోపాలు ఉన్నట్టు స్పష్టంగా కనిపిస్తున్నాయని ప్రజలు ఆరోపిస్తున్నారు. అతివేగం, ముందు వాహనాన్ని ఓవర్టేక్ చేయడమే రోడ్డు ప్రమాదాలకు కారణమని పోలీసులు చెబుతున్నారు.