Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సిటీబ్యూరో/జూబ్లీహిల్స్
హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో అక్రమంగా తరలిస్తున్న భారీ నగదును వెస్ట్‌జోన్ టాస్క్ఫోర్సు పోలీసులు సోమవారం స్వాధీనం చేసుకున్నారు. మునుగోడు ఉపఎన్నిక కోసం డబ్బులను తరలిస్తున్నట్టు సమాచారం అందుకున్న పోలీసులు రూ.89.92 లక్షలతోపాటు కారును సీజ్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కడారి శ్రీనివాస్ కారులో భారీగా నగదును తీసుకెళ్తున్నట్టు టాస్క్ఫోర్సు పోలీసులకు సమాచారం అందింది. ప్రత్యేక నిఘా వేసిన పోలీసులు జూబ్లీహిల్స్‌లోని భారతీయ విద్యాభవన్ సమీపంలో తనిఖీలు నిర్వహించారు. అటుగా వచ్చిన కారును తనిఖీ చేయగా అందులో భారీగా డబ్బులను గుర్తించారు. కడారి శ్రీనివాస్‌ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ వ్యక్తిగత సహాయకుడు జనార్దన్ వద్ద కడారి శ్రీనివాస్ డ్రైవర్‌గా పనిచేస్తున్నట్టు గుర్తించారు. జూబ్లీహిల్స్‌లోని త్రిపుర కన్స్ట్రక్షన్ కంపెనీ నుంచి మునుగోడుకు డబ్బులను తరలిస్తున్నట్టు విచారణలో తేలింది. తదుపరి విచారణ కోసం నిందితుడిని జూబ్లీహిల్స్ పోలీసులకు అప్పగించారు.