Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రయివేటు సెక్యూరిటీ గార్డుల రాష్ట్రస్థాయి ధర్నా
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
జీ.వో.నెంబర్ 21ను గెజిట్ చేసి అమలు చేయాలంటూ సెక్యూ రిటీ గార్డులు రాష్ట్ర స్థాయి ధర్నా నిర్వహించారు. ప్రయివేటు సెక్యూ రిటీ గార్డ్స్, అలైడ్ వర్కర్స్ యూని యన్స్ (సీఐటీయూ) ఆధ్వర్యంలో సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి బి.మధు అధ్యక్షతన సోమవారం హైదరాబాద్ ఆర్టీసీ క్రాస ్రోడ్స్లోని లేబర్ కమిషనర్ కార్యాలయం వద్ద ధర్నా చేశారు. కేంద్ర ప్రభుత్వం సెక్యూరిటీ కార్మికులు, వాచ్మెన్లకు వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయా లనీ, సెక్యూరిటీ సర్వీసెస్‌లో పని చేసే గార్డులు మొదలు సెక్యురిటీ ఆఫీసర్ వరకు వెల్ఫేర్ బోర్డులో భాగస్వాములను చేయాలనీ, ప్రయివేటు సెక్యూరిటీ ఏజెన్సీల నియంత్రణ చట్టం 2005ని అమలు చేయాలని ప్ల కార్డులు ప్రదర్శిస్తూ, నినాదాలు చేశారు. పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని కార్మికశాఖ జాయింట్ కమిషనర్ చంద్రశేఖర్‌కు అందజేశారు. అంతకు ముందు నిర్వహించిన ధర్నాను ఉద్దేశించి నేషనల్ కో ఆర్డినేషన్ కమిటీ ఆఫ్ ప్రయివేట్ సెక్యూరిటీ గార్డ్స్ అండ్ వర్కర్స్ కన్వీనర్, సీఐటీయూ అఖిల భారత ఉపాధ్యక్షులు ఎం.సాయిబాబు మాట్లాడుతూ సెక్యూరిటీలకు సంబంధించి వ్యయం తగ్గించేందుకు ప్రభుత్వ, ప్రయివేటు కంపెనీలు అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన నియమించుకుంటున్నాయని విమర్శించారు. వారి భద్రతను పూర్తిగా ఏజెన్సీలకు వదిలేసి ప్రధాన యజమాని బాధ్యత విస్మరించడం సరికాదన్నారు. దోపిడీ చేయకుండా ఏజెన్సీలను నియంత్రించాలని డిమాండ్ చేశారు. సెక్యూరిటీ గార్డులకు వేతన, ఉద్యోగ భద్రత ఈఎస్ఐ, పీఎఫ్ తదితర సౌకర్యాలు అందేలా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.
కమిషనర్ సానుకూల స్పందన
డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని జేఎల్ఓ చంద్రశేఖర్‌కు సమర్పించారు. అన్ని డిమాండ్లను సానుకూలంగా పరిశీలిస్తాననీ, నిర్దిష్టంగా ఫిర్యాదు చేస్తే విచారణ జరిపిస్తానని హామీ ఇచ్చారు. అనంతరం సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి ఎస్.భూపాల్ మాట్లాడుతూ, మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్కు మద్ధతిచ్చే ముందు కార్మికులకు సంబంధించిన సమస్యలను పరిష్కరించాలంటూ సీఎం వద్ద పార్టీ నాయకులు చర్చించినట్టు తెలిపారు. ఆ మేరకు కనీస వేతనాల మండలిని ఏర్పాటు చేయాలని సీఎంఓ నుంచి ఆదేశాలు వచ్చినట్టు జేఎల్ఓ చెప్పినట్టు వివరించారు. 73 షెడ్యూల్డ్ పరిశ్రమల్లో పని చేస్తున్న కోట్లాది మంది సమస్యలెదుర్కొంటున్నారని తెలి పారు. రాష్ట్రంలో లక్ష మంది సెక్యూరిటీ గార్డులకు వస్తున్న వేతనాలు వారి విద్య, వైద్యం ఖర్చులకు సరిపోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అపార్ట్ మెంట్లలో పని చేసే వాచ్మెన్లకు ఇప్పటికీ మార్గదర్శకాలు లేవని ఆగ్రహం వ్యక్తం చేశారు. జీ.వో.21 సాధించే వరకు పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ హైదరాబాద్ సెంట్రల్ సిటీ కార్యదర్శి ఎం.వెంకటేష్, సీఐటీయూ రాష్ట్ర నాయకులు కె.ఈశ్వర్ రావు, హైదరాబాద్ సెంట్రల్ సిటీ అధ్యక్షులు జె.కుమారస్వామి, శ్రామిక మహిళ సమన్వయ కమిటీ కన్వీనర్ ఆర్.వాణి, మేడ్చల్ జిల్లా ఉపాధ్యక్షులు పి.గణేష్, అపొలొ సెక్యూరిటీ అధ్యక్షులు సి.మల్లేష్, రంగారెడ్డి జిల్లా వాచ్మెన్ యూనియన్ నాయకులు భీమా నాయక్, అపొలొ యూనియన్ ప్రధాన కార్యదర్శి దామోదర్, బుద్ధ పూర్ణిమ ప్రాజెక్ట్ (హెచ్ఎండీఏ) యూనియన్ ప్రధాన కార్యదర్శి ఆరోగ్యమ్మ తదితరులు పాల్గొన్నారు.