Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
మునుగోడు ఉపఎన్నికల్లో టీఆర్ఎస్ గెలుపు ఖాయమైందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జీ జగదీశ్‌రెడ్డి అన్నారు. చండూరులో ముఖ్యమంత్రి సభ తరువాత బీజేపీ ఓటమి ఖాయమని స్పష్టమయ్యిందన్నారు. ఓటమిని గ్రహించే బీజేపీ రాజ్యాంగ బద్ధమైన సంస్థలను వాడుకుంటూ ఎన్నికల్లో చేయకూడని అక్రమాలన్నింటికీ పాల్పడుతుందని విమర్శించారు. మునుగోడు నియోజకవర్గంలోకి తనను రానివ్వకున్నా, టీఆర్ఎస్ విజయాన్ని మాత్రం ఎవరూ ఆపలేరని స్పష్టంచేశారు. కేవలం సీఎం కేసీఆర్‌ను వ్యక్తిగతంగా తిట్టడం తప్ప, ప్రజా సమస్యల పరిష్కారంపై బీజేపీ నేతలు నోరుమెదపకపోవడాన్ని ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. పార్టీని జోడించుకోవడం చేతకాని రాహూల్‌గాంధీ దేశాన్ని జోడించేందుకు బయల్దేరారని ఎద్దేవా చేశారు. ఆయన పాదయాత్ర గుజరాత్‌కు ఎందుకు వెళ్లట్లేదని ప్రశ్నించారు.