Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
ప్రభుత్వ ఉద్యోగులపై బీజేపీ నేతలు చేస్తున్న ఆరోపణలు సరికాదని శాసన మండలి మాజీ చైర్మెన్ స్వామి గౌడ్, టీఆర్ఎస్ నేత దేవిప్రసాద్ అన్నారు. సోమవారంనాడిక్కడి తెలంగాణ భవన్లో జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ప్రభుత్వ ఉద్యోగులు అమ్ముడు పోయి ఉంటే ఆనాడు ఉద్యమంలో ఉండే వాళ్లు కాదన్నారు. అప్పట్లో బీజేపీ నేత కిషన్రెడ్డి పోరుయాత్ర చేస్తే ఉద్యోగులు ప్రతిజిల్లాలో పాల్గొన్నారని గుర్తుచేశారు. స్వార్థం కోసం తెలంగాణ ఎన్జీవో సంఘం, ఉద్యోగ సంఘాలు ఎక్కడా, ఎవరికీ అమ్ముడు పోలేదన్నారు. ఉద్యోగులకు సకాలంలో జీతాలు అందకపోవడం గతంలో కూడా జరిగిందని అన్నారు. ఉద్యోగులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.